ఏపీ ఎక్స్ప్రెస్లో పొగలు

విశాఖపట్నం నుంచి ఢిల్లీ వెళ్తున్న ఏపీ ఎక్స్ప్రెస్కు తృటిలో ప్రమాదం తప్పింది. వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్కు చేరుకునే సరికి ఎస్ 6 భోగిలో హఠాత్తుగా పొగలు వచ్చాయి. బ్రేక్ జామ్ కావడంతో ఒక్కసారిగా పొగ అలుముకోవడంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ట్రైన్ ను నిలిపేశారు. అగ్నిమాపక యంత్రాలు ఉపయోగించి మంటల్ని ఆర్పేశారు. బ్రేక్స్ జాం కావడంతోనే పొగలు వచ్చినట్లు సిబ్బంది గుర్తించారు. భోగి నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. స్టేషన్లో గంటపాటు ట్రైన్ ఆగిపోవడంతో ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.