
నాసిక్ రోడ్‌లోని ఇండియా సెక్యూరిటీ ప్రెస్ (ఐఎస్‌పీ) 108 వెల్ఫేర్ ఆఫీసర్, జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది.
వెల్ఫేర్ ఆఫీసర్: ఈ పోస్టులకు డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి. కనీసం 2 సంవత్సరాల పోస్ట్-క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి. జూనియర్ టెక్నీషియన్: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ/ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. ఎన్‌సీవీటీ/ ఎస్‌సీవీటీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
అప్లికేషన్స్: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో జులై 31 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.ispnasik.spmcil.com వెబ్సైట్లో సంప్రదించాలి.