ఉత్సాహంగా టెక్నోజియాన్‌‌‌‌‌‌‌‌

ఉత్సాహంగా టెక్నోజియాన్‌‌‌‌‌‌‌‌

కాజీపేట, వెలుగు : వరంగల్‌‌‌‌‌‌‌‌ నిట్‌‌‌‌‌‌‌‌ టెక్నోజియాన్‌‌‌‌‌‌‌‌ 2024 రెండో రోజైన శనివారం పలు ఈవెంట్లతో ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా ‘ఫీల్‌‌‌‌‌‌‌‌ ది పెయిన్‌‌‌‌‌‌‌‌’ అనే ఈవెంట్‌‌‌‌‌‌‌‌ ద్వారా పీరియడ్స్​టైంలో మహిళలకు ఎలాంటి నొప్పి ఉంటుందో సిమ్యులేటర్‌‌‌‌‌‌‌‌ ద్వారా అబ్బాయిలకు అవగాహన కల్పించారు. డీఎన్‌‌‌‌‌‌‌‌ఏ, వేలిముద్రలు నేర పరిశోధనలో ఎలా ఉపయోగపడుతాయో ఫోరెన్సిక్‌‌‌‌‌‌‌‌ ఇన్విస్టిగేషన్‌‌‌‌‌‌‌‌ ద్వారా వివరించారు. మెకానికల్‌‌‌‌‌‌‌‌ ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్లు తాము తయారు చేసిన వాహనాన్ని నడిపి చూపించారు. ప్యూచర్‌‌‌‌‌‌‌‌ మేనేజర్, డచ్‌‌‌‌‌‌‌‌ వేలం, సికాడా తదితర ఈవెంట్లను ప్రదర్శించారు. మ్యాథ్ స్కేర్ ఫౌండర్ డాక్టర్ గజేంద్ర పురోహిత్, మాజీ ఐఎఎస్ డాక్టర్‌‌‌‌‌‌‌‌ తనూ జైన్‌‌‌‌‌‌‌‌ హాజరయ్యారు.