వరంగల్ నిట్ లో టెక్నోజియాన్ షురూ

వరంగల్ నిట్ లో టెక్నోజియాన్ షురూ
  • నవంబర్​ 9,10 తేదీల్లో ఈవెంట్లు

కాజీపేట, వెలుగు : వరంగల్ లోని ఎన్ఐటీ లో టెక్నోజియాన్ – 2024 ప్రోగ్రామ్ శుక్రవారం షురూ అయింది. మూడు రోజులు జరగనుంది. హైదరాబాద్ సీఎస్ఐఆర్ ఐఐసీటీ సైంటిస్ట్ ఎన్ వీ చౌదరి తొలిరోజు కార్యక్రమానికి హాజరైన ప్రారంభించి మాట్లాడారు. దేశంలోని సమస్యలకు నిట్ స్టూడెంట్లు సాంకేతిక నైపుణ్యాలతో పరిష్కారాలు అందించాలని పేర్కొన్నారు. విజ్ఞానాన్ని , నెట్ వర్క్ ను పరస్పరం మార్పిడి చేసుకునేందుకు ఇలాంటి టెక్నాలజీ ప్రోగ్రామ్  గొప్ప వేదికలా ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతి స్టూడెంట్ టెక్నోజియాన్ ను ఒక లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్ గా తీసుకుని ఈవెంట్ లో పాల్గొని సాంకేతికంగా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. 

టెక్నికల్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ ప్రొ. హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. రోబోటిక్ క్లబ్ ప్రదర్శన శనివారం సాయంత్రం ఉంటుందని, ఇందులో 100 మంది స్టూడెంట్లు పాల్గొంటున్నారని తెలిపారు. మ్యాథమెటికల్ సొసైటీ  డేటా సైన్స్ పై నిర్వహించే డేటా సైన్స్ క్వెస్ట్, ఫొటోగ్రఫీ క్లబ్  చే రిక్రియేటింగ్ ది మూమెంట్, క్విజ్ క్లబ్ సికాడా, కేబీసీ ఈవెంట్లను నిర్వహిస్తారు. తొలి రోజు 50 ఈవెంట్లను స్టూడెంట్లు ప్రదర్శించారు. మిగతా రెండు రోజులు సాంకేతిక ప్రదర్శనలు, వివిధ అంశాలపై గెస్ట్ లెక్చర్లు ఉంటాయి. క్నోజియాన్ స్టూడెంట్స్ కో ఆర్డినేటర్ ఇషాన్, లెక్చరర్లు శ్రీనివాస్, మురళీధర్ పాల్గొన్నారు.