గీతంలో ల్యాబ్​ను ప్రారంభించిన టీ-వర్క్స్ సీఈవో

గీతంలో ల్యాబ్​ను ప్రారంభించిన టీ-వర్క్స్ సీఈవో

రామచంద్రాపురం, వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండల పరిధిలోని గీతం వర్సిటీలో ఏర్పాటు చేసిన టెక్నాలజీ ఎక్స్​ప్లోరేషన్​అండ్ ప్రొడక్ట్ ఇంజనీరింగ్ ల్యాబ్​ను (టీఈపీ)  టీ-వర్క్స్ ముఖ్య కార్యనిర్వహణాధికారి జోగిందర్ తనికెళ్ల మంగళవారం ప్రారంభించారు. గీతం హైదరాబాద్ అడిషనల్​వైస్​ చాన్స్​లర్, ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డెరైక్టర్, డీన్-కోర్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ రామశాస్త్రి వేదాల, ఎంఎస్ఎంఈ నోడల్ అధికారి అరవింద్ బాబు సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమ ఆధారిత పాఠ్యాంశాలతో పాటు గణనీయమెన అనుభవం, ఇంటర్న్ షిప్​లతో  పరిశ్రమకు సిద్ధంగా ఉన్న సాంకేతిక విద్యార్థులను తయారు చేయడం గీతం వంటి విశ్వవిద్యాలయాల ప్రాముఖ్యత అని చెప్పారు. విద్యార్థులకు ప్రయోగాత్మక అభ్యాస అనుభవాన్ని అందించడానికి, వారి వినూత్న, సృజనాత్మక నైపుణ్యాలను ప్రదర్శించడానికి, వారి ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసాన్ని మెరుగుపరచడానికి దీనిని రూపొందించినట్టు వివరించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ అధ్యాపకులు, స్టూడెంట్స్​పాల్గొన్నారు.