ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ సిటీల్లోనే కాదు గ్రామాల్లోనూ వాడుతున్నారు. ఇప్పటికే పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే వంటివి ఉన్నాయి. అయితే, తాజాగా జియో పే కూడా అందుబాటులోకి వచ్చింది. జియో కంపెనీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ సరికొత్త ఆలోచనలతో యూజర్లను ఆశ్చర్యపరుస్తుంటుంది. లేటెస్ట్గా జియో పేమెంట్స్ యాప్ తీసుకొచ్చి మరోసారి సర్ప్రైజ్ చేసింది.
ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్‌గా ఆర్బీఐ నుంచి ఆమోదం పొందింది. దీంతో వ్యాపారులు, కస్టమర్లు ఈజీగా డిజిటల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్‌గా, జియో పేమెంట్స్ డెబిట్, క్రెడిట్ కార్డులు, యూపీఐ, ఇ– వ్యాలెట్స్ మరికొన్నింటితో సహా వెరైటీ పేమెంట్ మెథడ్స్ యాక్సెప్ట్ చేసే కెపాసిటీని బిజినెస్‌లకు అందిస్తాయి.