నోట్‌బుక్ ఎల్‌ఎం (Notebook LM)ను గతంలో ప్రాజెక్ట్ టైల్‌విండ్ అని పిలిచేవారు. యూజర్లకు వారి డాక్యుమెంట్ల నుంచి కంటెంట్‌తీసుకోవడానికి, క్రియేట్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. కొత్త గూగుల్ ఏఐ డివైజ్‌ల్లో ఒకటి గూగుల్ జెమిని. రఫ్ నోట్స్‌ని తక్కువ వాక్యాలతో వరుస క్రమంలోకి మారుస్తుంది నోట్‌బుక్ ఎల్‌ఎం. దీని ద్వారా సెర్చ్, టైపింగ్ ఈజీ అవుతాయి.
నోట్‌బుక్ ఎల్‌ఎం కార్యాచరణ వివిధ రకాల డాక్యుమెంట్ రకాలను ప్రాసెస్ చేస్తుంది. ముఖ్యంగా రీసెర్చ్ నోట్స్‌తో పాటు ఇంటర్వ్యూ ట్రాన్స్‌స్క్రిప్ట్‌లు, కార్పొరేట్ పత్రాలు, పీడీఎఫ్‌లు, గూగుల్ డాక్స్, గూగుల్ స్లయిడ్‌లు, టెక్స్ట్ ఫైల్‌లు, వెబ్ యూఆర్ఎల్‌లను కూడా అప్‌లోడ్ చేయొచ్చు.
- ఇన్‌లైన్ సిటేషన్స్ – కంటెంట్‌లో ఏదైనా ఈజీగా సెర్చ్ చేసేందుకు ఉపయోగపడుతుంది.
- నోట్‌బుక్ గైడ్ – తరచూ అడిగే ప్రశ్నలు, బ్రీఫింగ్ డాక్స్ లేదా స్టడీ గైడ్స్ వంటి ఫార్మాట్‌లుగా మారుస్తుంది.
- జెమిని1.5 ప్రో మల్టీమోడల్ – యూజర్లు కంటెంట్‌కి సంబంధించిన చిత్రాలతో పాటు చార్ట్‌లు, గ్రాఫ్‌ల గురించి ప్రశ్నించొచ్చు. ముఖ్యంగా నోట్ బుక్ ఎల్ఎంకు పూర్తి ప్రైవసీ, సేఫ్టీ ఉందని గూగుల్ హామీ ఇస్తోంది.