పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులను తగ్గించడంలో టెక్నాలజీని వాడుకోవాలి : హైకోర్టు సీజేఐ అలోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆరాదే

పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులను తగ్గించడంలో టెక్నాలజీని వాడుకోవాలి : హైకోర్టు సీజేఐ అలోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆరాదే

కరీంనగర్ టౌన్,వెలుగు : కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గొప్ప చరిత్ర ఉందని, అటువంటి జిల్లాలో పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసుల సంఖ్యను తగ్గించేందుకు లాయర్లు, జడ్జిలు కృషి చేయాలని రాష్ట్ర హైకోర్టు చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆరాదే సూచించారు. ఆదివారం కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కోర్టు ప్రాంగణంలో రూ.82కోట్లతో నిర్మిస్తున్న కోర్టు కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు పాటు బ్యాంకు కాలనీలో లాయర్లకు నిర్మించే 20 గృహాలకు జిల్లా ప్రిన్సిపల్ జడ్జి ప్రతిమతో కలిసి శంకుస్థాపన చేశారు.

అనంతరం కోర్టు ఆవరణలో  మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోక్సో, ఫ్యామిలీ కోర్టులు ఉండేలా కాంప్లెక్స్ నిర్మిస్తున్నామన్నారు. పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించేందుకు  టెక్నాలజీని ఉపయోగించాలని సూచించారు. కరీంనగర్ కోర్టు బిల్డింగ్ 18 నెలల్లో అందుబాటులోకి రానుందన్నారు. భవన నిర్మాణానికి కృషిచేసిన మాజీ హైకోర్టు జడ్జి పి.నవీన్ రావును సన్మానించారు.

ఆయనతోపాటు జడ్జిలు జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కె.లక్ష్మణ్, జస్టిస్ టి.వినోద్ కుమార్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి, జస్టిస్ ఎన్.వి శ్రవణ్ కుమార్, జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్, జస్టిస్ పుల్ల కార్తీక్, జస్టిస్ జె.శ్రీనివాసరావు, పీపీ కుమార్ గౌడ్, తెలంగాణ బార్ అసోసియేషన్ సభ్యుడు లక్ష్మణ్​కుమార్, కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్, కలెక్టర్ పమేలాసత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దేశాయ్,అడ్వకేట్లు, తదితరులు పాల్గొన్నారు.