కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చిన తరువాత వాహనాదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో లైసెన్స్, సీబుక్, ఇతర డాక్యుమెంట్లు లేకున్నా హెల్మెట్ పెట్టుకొని బండి స్టార్ట్ చేసి రయ్ మని వెళ్లే వారు . అయితే ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు కొత్తగా ఓ డివైజ్ వచ్చింది. ఈ డివేజ్ ఫిక్స్ చేస్తే బండి నడవాలంటే కీ.. ఆయిల్ ఉంటే సరిపోదు.. మరి ఏం అవసరమా అనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి...
బండి స్టార్ట్ కావాలంటే కీ ఉంటే సరిపోతుంది కదా.. అనుకుంటున్నారా? వెహికిలకు ఈ డివైజ్ ఫిక్స్ చేస్తే లైసెన్స్ లేకుండా స్టార్ట్ అయ్యే అవకాశమే లేదు. బండి స్టార్ట్ కావాలంటే.. లైసెన్స్ ఉండాల్సిందేనని యువ ఇంజనీర్లు అంటున్నారు. ఎవరైనా బండి కొట్టేయాలంటే అది కుదరని పనే కాదని కూకట్ పల్లి జేఎన్టీయూలో ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్లో బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు చెబుతున్నారు.వెహికిల్స్ దొంగతనాలు జరగకుండా అడ్డుకట్ట వేసేందుకు ఒక డివైజ్ను కనుగొన్నారు. అందులో స్కానింగ్ మాడ్యూల్, మైక్రో కంట్రోల్ పోగ్రాంను ఇన్స్టాల్ చేశాడు. ఆర్సీ కార్డు, లైసెన్స్ ఏదైనా ఒకటి స్కాన్ చేస్తేనే వెహికిల్ స్టార్ట్ అవుతుంది. లేదంటే బండి నడవడం కష్టమే.
ఈ సిస్టంలో వైర్లెస్ కార్డు స్కానింగ్ మాడ్యూల్ ఇంటిగ్రేడెట్ సర్క్యూట్ ద్వారా వెహికిల్స్ స్టార్ట్ అవుతాయి. అంటే ఆర్సీ నంబర్ లేదా లెసెన్స్ నంబర్ తో లింక్ చేసిన కార్డును స్కాన్ చేస్తేనే బండి స్టార్ట్ అవుతుంది. ఈ టెక్నాలజీని ఈ మధ్యే ప్రయోగాత్మకంగా నిరూపించాడు మల్లేశంఅనే యువ ఇంజనీరు. గతంలో కూడా ఇలాంటి పలు ఆవిష్కరణలు చేశాడు. చిన్నపిల్లలను కాపాడే డివైజ్, ప్రమాదాలు నివారించే డివైజ్, ఆటోమెటిక్ గా వెలిగే స్ట్రీట్ లైట్స్ తయారుచేసి అందరితో శభాష్ అనిపించుకున్నాడు.