- క్వాలిటీ లేని ఇండ్లు కూలితే ఎవరు బాధ్యులు
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టెక్రియాల్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల క్వాలిటీపై చర్చించేందుకు ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తేదీ ప్రకటించాలని, 12 గంటల ముందు చెబితే ఏ రోజైనా వచ్చేందుకు తాను రెడీ గా ఉన్నానని మాజీ మంత్రి, కాంగ్రెస్‌నేత షబ్బీర్‌అలీ పేర్కొన్నారు. శనివారం కామారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ.. ఛాలెంజ్ కోసం నేను రాజకీయాలు చేయడం లేదని, క్వాలిటీ లేని పనులతో ప్రజల ప్రాణాలు పోవద్దనేదే ఉద్దేశమన్నారు. కమీషన్ల కోసం క్వాలిటీ లేని వర్క్స్ చేయడం ఏమాత్రం సరికాదన్నారు. అంతటా డబుల్ బెడ్రూం ఇండ్లకు డిమాండ్ ఉంటే టెక్రియాల్‌లో ఇండ్లు కేటాయించినా, అందులోకి వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారన్నారు.
ఎప్పుడు కూలిపోతాయో చెప్పలేని పరిస్థితి నెలకొని ఉందని వాపోయారు. ఇండ్లు కూలితే సీఎం కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధనే బాధ్యులని, వీరిపై కేసులు పెడతామన్నారు. ఇండ్లను పూర్తిగా కూల్చి, మళ్లీ కట్టడానికి ప్రభుత్వం నుంచి పర్మిషన్తీసుకురావాలని ఎమ్మెల్యేకు సూచించారు. క్వాలిటీ లేవని, పగుళ్లు వచ్చాయని తాము చూపిస్తే, వాటికి ఇప్పుడు పైపై మెరుగులతో రిపేర్లు చేయడమేంటని వాపోయారు. మీటింగ్‌లో డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్శ్రీనివాస్రావు, వైస్ప్రెసిడెంట్చంద్రకాంత్రెడ్డి, పండ్ల రాజు, గూడెం శ్రీనివాస్‌రెడ్డి, భీమ్‌రెడ్డి, యాదవ్రెడ్డి, సుతారి రమేశ్ పాల్గొన్నారు.