- 400 జీసీసీల ఏర్పాటే లక్ష్యమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రస్తుతం 220 గ్లోబల్కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) ఉన్నాయని, వాటిని 400కు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, ఇండస్ట్రీస్శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. హైదరాబాద్‌లో ఎంతో మంది నిపుణులున్నారని, దీంతో ఇన్నోవేషన్‌కు హైదరాబాద్ కేంద్రంగా మారుతున్నదని చెప్పారు. ప్రముఖ టెక్నాలజీ సంస్థ టెక్వేవ్గ్లోబల్డెవలప్మెంట్ సెంటర్ (జీడీసీ)ని శనివారం మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లక్ష చదరపుటడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఈ జీడీసీతో అదనంగా 1200 మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.
రాష్ట్ర భవిష్యత్‌ను డిజిటల్‌గా ఎంపవర్ చేసేందుకు టెక్వేవ్జీడీసీ దోహదం చేస్తుందని వివరించారు. చిన్న పట్టణాల్లోనూ టెక్నాలజీ రంగాన్ని విస్తరించాలన్నది తమ సంకల్పమని స్పష్టం చేశారు. ఇన్నొవేషన్, స్కిల్‌కు సంబంధించి సమ్మిళిత వృద్ధిని సాధించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. గ్లోబల్ డిజిటల్ ఎకానమీలో తెలంగాణ, ఇండియాను లీడర్‌గా నిలబెట్టేందుకు టెక్‌వేవ్ జీడీసీ తోడ్పడుతుందన్నారు. ఈ ఏడాది 20వ వార్షికోత్సవం జరుపుకోవడంతో పాటు హైదరాబాద్‌లో అత్యాధునిక సెంటర్‌ను ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని టెక్‌వేవ్ కో ఫౌండర్, చైర్మన్గుమ్మడపు దామోదర్‌రావు అన్నారు. సంస్థలో ప్రపంచవ్యాప్తంగా 4000 మంది పనిచేస్తున్నారని, మన దేశంలో హైదరాబాద్‌లో 2400 మంది, ఖమ్మంలో 500 మంది అసోసియేట్స్ పనిచేస్తున్నారని తెలిపారు.