కిరాణం టెండర్లలో గోల్​మాల్​

  • టెన్షన్​ పడుతున్న విద్యాశాఖ, గురుకుల ఆఫీసర్లు 
  • కాంట్రాక్టర్​కు కాసులు.. స్టూడెంట్స్​కు తప్పని తిప్పలు 
  • నల్గొండ జిల్లాలోనే ఆఫీసర్ల సొంత రూల్స్​
  • సరియైన రేట్లకు సప్లై చేస్తామన్న కాంట్రాక్టర్లను రిజక్ట్​ చేసిన వైనం 
  • బీసీ, ఎస్సీ, మైనార్టీ గురుకుల టెండర్లలోనూ అదే తంతు

నల్గొండ, వెలుగు : గురుకులాల్లో ‘కిరాణం టెండర్‌‌‌‌‌‌‌‌’ పేరు వింటేనే ఆఫీసర్లు హడలిపోతున్నారు. కానీ పైఆఫీసర్లు చెప్పినట్లు వినకుంటే ఎక్కడ చిక్కుల్లో పడతామోనన్న భయం వారిని వెంటాడుతోంది. రాష్ట్రంలో ఎక్కడా లేని రూల్స్‌‌‌‌‌‌‌‌ కేవలం ఒక్క నల్గొండ జిల్లాలోనే అమలు చేయడం వెనుక ఆంతర్యమేంటన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. కేజీబీవీ, మోడల్‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌లో కిరాణం టెండర్‌‌‌‌‌‌‌‌ దక్కిన కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌కే మళ్లీ బీసీ, ఎస్సీ, మైనార్టీ గురుకులాల టెండర్‌‌‌‌‌‌‌‌ అప్పగించేందుకు పావులు కదుపుతున్నారు. సూర్యాపేట జిల్లా ఆఫీసర్లు ఇవే రూల్స్​ పాటించారు.

ఆ  జిల్లాలో కేజీబీవీ, మోడల్​స్కూల్స్​టెండర్లు డివిజన్ల వారీగా పిలిచి ఫైనల్ చేశారు. దీంతో అక్కడ ఎలాంటి సమస్య తలెత్తలేదు. కానీ బీసీ, ఎస్సీ, గురుకుల టెండర్లలో పేట జిల్లా ఆఫీసర్లు వ్యవహరించిన తీరు నచ్చక పలువురు కాంట్రాక్టర్లు కోర్టులో కేసు వేశారు. దానివల్ల అక్కడ టెండర్ల​ ప్రక్రియ అయోమయంలో పడింది. ఇప్పుడు నల్గొండలో కూడా బీసీ, ఎ స్సీ, మైనార్టీ గురుకులాల్లో కిరాణం టెండర్లు పిలవకుంటే ఇక్కడ కాంట్రాక్టర్లు సైతం కోర్టులో కేసు వేసేందుకు సిద్ధమవుతున్నారు. 

నామమాత్రంగానే నెగోషియేషన్​..? 

ఏటా టెండర్లు పిలిచే కాంట్రాకర్ల అర్హతను పరిశీలించే అధికారులు తక్కువ రేట్లు కోట్​​చేసిన కాంట్రాక్టర్లకే టెండర్​ ఫైనల్​ చేసేవారు. కానీ ఈసాని టెండర్లకు ఆఫీసర్లు కొత్త రూల్స్​ పెట్టి చాలా మంది కాంట్రాక్టర్లు.. టెండర్లు పాల్గొనకుండా భయభ్రాంతులకు గురి చేశారు. ముగ్గురు, నలుగురు మాత్రమే పోటీల్లో నిలిచారు. టర్నోవర్​ లేదన్న కారణంతో చాలా టెండర్లను రిజక్ట్​ చేశారు. 

కేవలం టర్నోవర్​రూల్ ను అడ్డం పెట్టుకుని రేట్ల విషయంలో నామమాత్రంగానే చేసి ఒక్కరినే ఫైనల్ చేశారు. అయితే రిజక్ట్ చేసిన కాంట్రాక్టర్లు కోడ్ చేసిన రేట్లను కనీసం పరిశీలన కూడా చేయకపోవడం గమనార్హం. గతేడాది ఎస్సీ గురుకులం క్యాటరింగ్​టెండర్లలో అర్హత లేదని పలువురు కాంట్రాక్టర్లను రిజక్ట్​ చేసినప్పటికీ, వాళ్ల కోట్ చేసిన రేట్లను మాత్రం ఆఫీసర్లు పరిగణలోకి తీసుకున్నారు. అన్ని అర్హతలు కలిగి, ఎక్కువ రేట్లతో కాంట్రాక్టు తీసుకుందామని భావించిన కాంట్రాక్టర్లు చివరకు తక్కువ రేట్లకే క్యాటరింగ్​పని ఒప్పుకోవాల్సి వచ్చింది. అయితే కేజీబీవీ, మోడల్​ స్కూల్స్​కిరాణం టెండర్లలో కాంట్రాక్టర్లు రిజక్ట్​ చేసిన ఆఫీసర్లు, వాళ్లు కోట్​చేసిన రేట్లను ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. వాళ్లు కోట్​చేసిన రేట్లను పరిశీలించినట్లయితే ఎంతో కొంతమేర నెగోషియేషన్​ జరిగి అన్ని రకాల ఐటమ్స్​కు సరియైన ధర లభించేది. తద్వారా గుడ్డు, మటన్​తోపాటు అన్ని రకాల కూరగాయలు సప్లై చేయడానికి వీలుండేది. కానీ ఇప్పుడు అధికారులు కేజీ చక్కెర రూ.50కు రేట్ ఫిక్స్​ చేశారు. కానీ ప్రస్తుతం బయట హోల్​సేల్​మార్కెట్లో రూ.40లకే లభిస్తుంది. అనాలోచిత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తదేమోనని ఆఫీసర్లు 
టెన్షన్ పడుతున్నారు. 

విద్యార్థులకు మళ్లీ తప్పని తిప్పలు..

ఈ విద్యాసంవత్సరంలో అయినా పౌష్టికాహారం అందకపోతుందా..? అని ఎదురు చూస్తున్న విద్యార్థులకు మళ్లీ నిరాశే ఎదురవుతోంది. అధికారుల అనాలోచిత నిర్ణయాలతో టెండర్లలో ఇష్టమొచ్చిన రూల్స్​అమలు చేయడంతో విద్యార్థులు ఇబ్బందుల్లో పడక తప్పేలా లేదు. కిరాణం సామాన్లకు ఎక్కువ రేట్లు, కూరగాయలు, పండ్లకు తక్కువ రేట్లు ఫిక్స్ చేయడంతో నాణ్యత లేని ఆహారం అందే పరిస్థితి కనిపిస్తోంది. మార్కెట్లో ఏవి చౌకగా లభిస్తే వాటినే కాంట్రాక్టర్లు సప్లై చేస్తారు. తద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందడం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.