
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమి టెడ్ ఫౌండేషన్ 2023–-24 విద్యా సంవత్సరానికి స్కాలర్షిప్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత: ఏదైనా విద్యాసంస్థలో ఫుల్‌టైమ్ కోర్సు రెగ్యులర్ విధానంలో చదువుతూ ఉండాలి. ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. ఎంపికైనవారికి ఏడాదికి రూ.48,000 చొప్పున కోర్సు పూర్తయ్యేంత వరకు ఉపకారవేతనం అందిస్తారు.
ఎంపిక: అభ్యర్థి చేరిన కోర్సు ఆధారంగా ఇంటర్ లేదా డిగ్రీలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం ఎంపిక ఉంటుంది. ఆన్లైన్లో నవంబర్ 30 వరకు అప్లై చేయాలి.