పగలు నేల మీద..రాత్రి నింగిలోకి

పగలు నేల మీద..రాత్రి నింగిలోకి

ఈ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌ను సరికొత్తగా నిర్వహిస్తున్న పారిస్ గేమ్స్‌‌‌‌‌‌‌‌ ఆర్గనైజర్లు  ఒలింపిక్ జ్యోతిని పగటిపూట నేలపై ఉండేలా.. సాయంత్రం గాల్లో తేలియాడేలా రూపొందించారు. శుక్రవారం రాత్రి అట్టహాసంగా సాగిన ఓపెనింగ్ సెర్మనీ తర్వాత ఒలింపిక్ విలేజ్‌‌‌‌‌‌‌‌లో కాల్డ్రన్‌‌‌‌‌‌‌‌ ( జ్యోతి)ను వెలిగించారు. దీన్ని ఒక భారీ బెలూన్‌‌‌‌‌‌‌‌కు ఎటాచ్ చేశారు. ఇది పగటి పూట నేలపై ఉంటుంది. సూర్యాస్తమయం నుంచి

 తెల్లవారుజామున 2 గంటల వరకు 60 మీటర్ల (197 అడుగులు) ఎత్తులో గాల్లో తేలియాడుతూ కనువిందు చేస్తోంది. శనివారం నుంచి ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌ ముగిసే వరకూ ప్రతీ రోజు ఈ పద్ధతిని కొనసాగిస్తారు. కాగా, ఒలింపిక్ చరిత్రలో శిలాజ ఇంధనాలను ఉపయోగించకుండా వెలుగుతున్న  మొదటి జ్యోతి ఇదే కావడం విశేషం.