ఓయూలో ఘనంగా తీజ్​ఉత్సవాలు

ఓయూ, వెలుగు: ఓయూలో తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తీజ్​ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శనివారం వేడుకల్లో ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రు నాయక్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.లక్ష్మీనారాయణ, ఓఎస్డీ రెడ్యా నాయక్ పాల్గొని మాట్లాడారు. సమాజం బాగుండాలని కోరుకుంటూ బంజారా ఆడబిడ్డలు భక్తిశ్రద్ధలతో ప్రకృతిని కొలిచే పండుగ తీజ్​అని చెప్పారు.

 తీజ్​ఉత్సవాలను ఓయూలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఓయూ ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ మంగు నాయక్, ప్రొఫెసర్లు భీమా నాయక్, నిర్వాహకులు శరత్ నాయక్, సుబ్బు నాయక్, అశోక్ నాయక్, విజయ నాయక్, లెక్చరర్లు, స్టూడెంట్లు పాల్గొన్నారు.