ఇంటికి ఆరు మొక్కలు నాటాలి
మెట్ పల్లి, వెలుగు : స్థానిక బల్దియా పరిధిలోని 26 వార్డుల్లో ప్రతి ఇంటికి ఆరు మొక్కల చొప్పున నాటి కాపాడాలని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అన్నారు. గురువారం పలు వార్డుల్లో ఇంటింటికీ మూడు పూలు, మూడు పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ మెట్ పల్లిని హరిత పట్టణంగా చేయడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సుజాత, వైస్ చైర్మన్ చంద్రశేఖర రావు, కమిషనర్ సమ్మయ్య, కౌన్సిలర్లు భవాని, లక్ష్మి పాల్గొన్నారు.
సీఎం సభకు గట్టి బందోబస్తు
పెద్దపల్లి, వెలుగు: సీఎం సభ కోసం బందోబస్తు పటిష్టంగా ఉండాలని మల్టీ జోన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నాగిరెడ్డి పోలీస్అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లాలో ఆగస్టు 29న సీఎం బహిరంగసభ ఉన్న నేపథ్యంలో గురువారం నాగిరెడ్డి సభాస్థలం బ్లూప్రింట్ పరిశీలించారు. సభ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి సీపీ సత్యనారాయణ, డీసీపీలు రూపేశ్, అఖిల్‌మహాజన్, ఏసీపీ సారంగపాణి, సీఐలు ప్రదీప్‌కుమార్, అనీల్‌కుమార్, ఎస్సైలు రాజేశ్, సహదేవ్సింగ్ఉన్నారు.
పోలీస్ స్టేషన్ తనిఖీ..
సుల్తానాబాద్: స్థానిక పోలీస్ స్టేషన్ ను గురువారం అడిషనల్ డీజీపీ వై నాగిరెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సర్కిల్ పరిధిలోని కేసులపై సమీక్ష జరిపారు. అనంతరం మాట్లాడుతూ సుల్తానాబాద్, పోత్కపల్లి, కాల్వ శ్రీరాంపూర్, జూలపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులు పరిష్కరించడంలో అధికారుల పనితీరు బాగుందని అభినందించారు.
దివ్యాంగుల ఆశ్రమంలో పండ్లు పంపిణీ
పెద్దపల్లి, వెలుగు: స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ బర్త్‌డే వేడుకల సందర్భంగా గురువారం పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రితోపాటు స్ఫూర్తి మానసిక దివ్యాంగుల ఆశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. అనంతరం జెండా చౌరస్తాలో ఆయన అభిమానులు కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో కొలిపాక అభిమానులు పాల్గొన్నారు.
రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలి
కరీంనగర్ టౌన్, వెలుగు: జిల్లాలో ప్రధాన రోడ్లకు ఇరువైపుల మొక్కలు నాటాలని కలెక్టర్ కర్ణన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా ప్రవేశం మొదలు, ప్రధాన రోడ్ల వెంట మొక్కలు నాటాలని, ఎండిపోయిన, విరిగిపోయిన మొక్కల స్థానంలో కొత్తమొక్కలను నాటాలని సూచించారు. నగరంలో రోడ్లవెంట నీరు నిలువకుండా చూడాలని, ఇండ్ల నిర్మాణాలకు వాడిన సిమెంట్, ఇసుక, మట్టి మొదలగునవి లేకుండా తీసివేయించాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలతా రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, అటవీ శాఖ అధికారి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
గిరిజన సంస్కృతికి ప్రతీక ‘తీజ్’
కోనరావుపేట,వెలుగు : గిరిజన సంస్కృతికి ప్రతీక తీజ్ పండుగ అని కరీంనగర్ మాజీ జడ్పీ చైర్పర్సన్తుల ఉమ అన్నారు. గురువారం కోనరావుపేట మండలం కమ్మరిపేట తండాలో గిరిజనులు నిర్వహించిన తీజ్ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలన్నారు. అనంతరం గిరిజన యువతులతో కలిసి డాన్స్చేశారు. ఆమె వెంట బీజేపీ జిల్లా కార్యదర్శి సురేందర్ రావు, మండలాధ్యక్షుడు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.
ఒలింపియాడ్స్ లో ‘అల్ఫోర్స్’ సత్తా
కొత్తపల్లి, వెలుగు: మ్యాథ్స్, సైన్స్ ఒలింపియాడ్స్‌లో కొత్తపల్లి అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్ స్టూడెంట్స్ సత్తాచాటారని చైర్మన్ వి.నరేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ విద్యా ప్రణాళికలో మ్యాథ్స్, సైన్స్ కు ప్రత్యేకమైన స్థానం ఉందని, ఈ సబ్జెక్ట్స్‌లో పట్టు సాధించాలని సూచించారు. పి.ఆద్యారెడ్డి, ఎన్.సుమాక్షిత్య రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంక్, ఎన్.ఆశీశ్, కె.నక్షత్రారెడ్డి సెకండ్ ర్యాంక్, టి.హనిత్, డి.వివేక్, డి.హాసిత్రెడ్డి, ఎన్.సరణీచంద్ర, ఎం.చిన్మయి, పి.జయవర్ధన్, కె.దీక్షారెడ్డి, పి.ధృవ్ ప్రశంసపత్రాలు సాధించారని తెలిపారు.
హన్మకొండ సభకు తరలిరండి
తిమ్మాపూర్, చొప్పదండి/రామడుగు వెలుగు: ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా ఆగస్టు 27న హన్మకొండలో జరిగే బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలిరావాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్పిలుపునిచ్చారు. మక్తపల్లిలో, చొప్పదండిలో గురువారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సభకు హాజరుకానున్నారని అన్నారు. అనంతరం దళిత మోర్చా, బీజేవైఎం అధ్యక్షులు ప్రభాకర్‌ను సన్మానించారు. సమావేశంలో మండలాధ్యక్షులు జగదీశ్వర్‌చారి, నాయకులు మల్లయ్య, శ్రీనివాస్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
కథలాపూర్: ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీలో తలపెట్టిన బీజేపీ బహిరంగ సభ కు భారీగా తరలి రావాలని బీజేపీ కిసాన్‌మోర్చా జగిత్యాల జిల్లా ప్రెసిడెంట్ కొడిపెల్లి గోపాల్‌రెడ్డి, కథలాపూర్ మండల శాఖ అధ్యక్షులు సత్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం కథలాపూర్ లో వారు మాట్లాడారు. భవిష్యత్‌లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని అన్నారు. సమావేశంలో బీజేపీ లీడర్లు సత్యం, మహేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
చిగురుమామిడి: ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను విజవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో గురువారం ఆయన మాట్లాడారు. బండి సంజయ్పాదయాత్రతో రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ పెరుగుతోందని అన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్థికంగా ఎదిగేందుకే ‘దళితబంధు’
జగిత్యాల వెలుగు: దళితుల ఆర్థిక సాధికారత కోసం దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. గురువారం రాయికల్ మండల మూటపల్లికి చెందిన బెక్కెం రాకేశ్‌కు దళిత బంధు ద్వారా మంజూరైన ఎర్టిగా వాహనాన్ని ఎమ్మెల్యే తన క్వార్టర్స్ లో అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ తిరుపతి, ఉప సర్పంచ్ రంజిత్, మండల రైతు బంధు సమితి కన్వీనర్ మోహన్ రావు, నషిర్ పాల్గొన్నారు
టీఆర్ఎస్ ది ఓటు బ్యాంకు రాజకీయం
కరీంనగర్, వెలుగు: టీఆరెస్, ఎంఐఎం కలిసి మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బి. సంజయ్ అన్నారు. గురువారం కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. పాతబస్తీ అభివృద్ధి కాకపోవడానికి ఈ రెండు పార్టీలే కారణమన్నారు. లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుటుంబ పాత్రపై జరుగుతున్న చర్చను దారి మళ్లించేందుకు సీఎం శాంతి భద్రతలకు భంగం కలిగించే కుట్రకు తెర తీశారన్నారు. తెలంగాణను అంతా శ్రీలంకలా ఊహించుకుంటున్నారని ఎంపీ సంజయ్ అన్నారు.
రాజన్న సన్నిధిలో హోమం
`వేములవాడ, వెలుగు : మాస శివరాత్రి సందర్భంగా స్థానిక రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చన నిర్వహించారు. స్థానచార్యులు భీమాశంకర్ శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిపారు. శ్రావణమాసం ముగింపు సందర్భంగా అద్దాల మండపంలో రుద్ర హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు.
ఎన్టీపీసీ బంద్ ప్రశాంతం
జ్యోతినగర్, వెలుగు: రామగుండం ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులపై జరిపిన లాఠీచార్జ్ కి నిరసిసనగా గురువారం చేపట్టిన బంద్ప్రశాంతంగా ముగింది. స్థానిక కాంగ్రెస్ లీడర్ల పిలుపు మేరకు ఎన్టీపీసీ ప్రారిశ్రామిక ప్రాంతాంలోని పెట్రోల్ బంకులు, చిన్న తరహ పరిశ్రమలు, షాపులు బంద్ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి మక్కాన్ సింగ్ ఠాకుర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
రాజీవ్ రహదారిపై రాస్తారోకో..
కాంట్రాక్ట్ కార్మికులపై లాఠీచార్జ్ కి చేయడం సిగ్గుచేటని బీజేపీ నేత కౌషిక్ హరి డిమాండ్ చేశారు. గురువారం ఎన్టీపీసీ లేబర్ గేట్ రాజీవ్ రహదారిపై జేఏసీ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన లీడర్లు రాస్తారోకో చేశారు. కార్యక్రమంలో నాయకులు రాజ్ ఠాగుర్, శంకర్, కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు.
ర్యాలీలకు అనుమతి లేదు
కరీంనగర్ క్రైం, వెలుగు: పట్టణంలో శుక్రవారం నుంచి ర్యాలీలు నిర్వహించడానికి ఏ పార్టీకి అనుమతి లేదని కరీంనగర్ సిటీ ఏసీపీ తుల శ్రీనివాస్ గురువారం రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొంతమంది సోషల్ మీడియాలో ర్యాలీ నిర్వహించడానికి పోలీసులు అనుమతిని వైరల్ వీడియోలు షేర్‌చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రస్తుత శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని వివిధ పార్టీల ర్యాలీలకు అనుమతిని నిరాకరించినట్లు పేర్కొన్నారు.
పేదల సంక్షేమమే టీఆర్ఎస్ ధ్యేయం
కొడిమ్యాల, వెలుగు: పేదల సంక్షేమమే టీఆర్ఎస్ప్రభుత్వ ధ్యేయమని స్థానిక పీఏసీఎస్ చైర్మన్ మేన్నేని రాజనర్సింగరావు అన్నారు. గురువారం కరీంనగర్ లోని ఆయన నివాసంలో మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎంపీపీ స్వర్ణలత ఆధ్వర్యంలో ఆయన పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. అనంతరం కొడిమ్యాల మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వద్ద అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు కృష్ణారావు, సర్పంచులు పద్మ, లత, కవిత మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
మిడ్‌మానేరు ఐక్యవేదిక ఉపాధ్యక్షుడి ఎన్నిక
బోయినిపల్లి, వెలుగు : రాజరాజేశ్వర(మిడ్ మానేర్) ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితుల ఐక్యవేదిక ఉపాధ్యక్షుడిగా బోయినిపల్లి మండలం నీలోజిపల్లికి చెందిన కె.శ్రీనివాస్ రెడ్డి ఎన్నికైనట్లు ఐక్యవేదిక వర్కింగ్ ప్రెసిడెంట్ కనుకయ్య గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం బీజేపీ మండల ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.
హన్మకొండ సభకు తరలిరండి
తిమ్మాపూర్, చొప్పదండి/రామడుగు వెలుగు: ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా ఆగస్టు 27న హన్మకొండలో జరిగే బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలిరావాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్పిలుపునిచ్చారు. మక్తపల్లిలో, చొప్పదండిలో గురువారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సభకు హాజరుకానున్నారని అన్నారు. అనంతరం దళిత మోర్చా, బీజేవైఎం అధ్యక్షులు ప్రభాకర్‌ను సన్మానించారు. సమావేశంలో మండలాధ్యక్షులు జగదీశ్వర్‌చారి, నాయకులు మల్లయ్య, శ్రీనివాస్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
కథలాపూర్: ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీలో తలపెట్టిన బీజేపీ బహిరంగ సభ కు భారీగా తరలి రావాలని బీజేపీ కిసాన్‌మోర్చా జగిత్యాల జిల్లా ప్రెసిడెంట్ కొడిపెల్లి గోపాల్‌రెడ్డి, కథలాపూర్ మండల శాఖ అధ్యక్షులు సత్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం కథలాపూర్ లో వారు మాట్లాడారు. భవిష్యత్‌లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని అన్నారు. సమావేశంలో బీజేపీ లీడర్లు సత్యం, మహేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
చిగురుమామిడి: ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను విజవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో గురువారం ఆయన మాట్లాడారు. బండి సంజయ్పాదయాత్రతో రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ పెరుగుతోందని అన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు శంకర్ తదితరులు
పాల్గొన్నారు.
ఒలింపియాడ్స్ లో ‘అల్ఫోర్స్’ సత్తా
కొత్తపల్లి, వెలుగు: మ్యాథ్స్, సైన్స్ ఒలింపియాడ్స్‌లో కొత్తపల్లి అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్ స్టూడెంట్స్ సత్తాచాటారని చైర్మన్ వి.నరేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ విద్యా ప్రణాళికలో మ్యాథ్స్, సైన్స్ కు ప్రత్యేకమైన స్థానం ఉందని, ఈ సబ్జెక్ట్స్‌లో పట్టు సాధించాలని సూచించారు. పి.ఆద్యారెడ్డి, ఎన్.సుమాక్షిత్య రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంక్, ఎన్.ఆశీశ్, కె.నక్షత్రారెడ్డి సెకండ్ ర్యాంక్, టి.హనిత్, డి.వివేక్, డి.హాసిత్రెడ్డి, ఎన్.సరణీచంద్ర, ఎం.చిన్మయి, పి.జయవర్ధన్, కె.దీక్షారెడ్డి, పి.ధృవ్ ప్రశంసపత్రాలు సాధించారని తెలిపారు.
దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు
కరీంనగర్ లీగల్, వెలుగు: రోటరి క్లబ్ నిజామాబాద్, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సమన్వయంతో దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలు అందజేయనున్నట్లు కరీంనగర్ జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి సుజయ్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కృత్రిమ అవయవాలు అవసరం ఉన్న వారు సెప్టెంబర్ 10లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 90103 18999, 86393 27246 నంబర్లపై సంప్రదించాలని జడ్జి సూచించారు.
జాలర్ల వలలో కొండచిలువ
జమ్మికుంట, వెలుగు : మండలంలోని కోరపల్లి గ్రామం పెద్ద చెరువులో జాలర్ల వలకు కొండ చిలువ చక్కింది. చెరువు పరిసరాల్లో కొండ చిలువ సంచరిస్తోందన్న విషయాన్ని గతంలో స్థానిక ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని గ్రామస్తులు తెలిపారు. గురువారం చేపలు పట్టేందుకు వెళ్లగా జాలర్ల వలకు చిక్కిందని అన్నారు. దీంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు.
ఆర్‌ఎఫ్‌సీఎల్ బాధితుడి ఆత్మహత్యాయత్నం
గోదావరిఖని, వెలుగు: రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో కాంట్రాక్టు ఉద్యోగం కోసం పెట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరుతూ ఓ బాధితుడు గురువారం గోదావరిఖనిలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పాలకుర్తి మండలంలోని రామారావుపల్లికి చెందిన బాధితుడు తన కుటుంబ సభ్యులతో అడ్డగుంటపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్ వద్ద అధికార పార్టీకి చెందిన ఇద్దరు దళారులను కలిసి డబ్బులివ్వాలని ఒత్తిడి చేశాడు. దీంతో వారు మరికొంత సమయం కావాలని కోరడంతో ఆగ్రహం చెందిన బాధితుడు వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంటానని బెదిరించాడు. దీంతో భయపడిన దళారులు రూ.20 వేల నగదును, మరో రూ.80 వేలకు రాసిన చెక్కును బాధితుడికి అందజేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. కాగా ఆర్‌ఎఫ్‌సీఎల్ ఉద్యోగ బాధితులు సెప్టెంబర్ మొదటి వారంలో గవర్నర్‌ను కలిసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.
గల్ఫ్ లో బండలింగాపూర్ వాసి మృతి
స్వగ్రామం చేరిన మృతదేహం
మెట్ పల్లి, వెలుగు: ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన యువకుడు గుండెపోటుతో చనిపోయాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మెట్ పల్లి మండలం బండ లింగాపూర్ గ్రామానికి చెందిన బావు అనిల్ కుమార్(40) కొన్నేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం దుబయి వెళ్లాడు. ఈనెల 22 న డ్యూటీ ముగించుకొని రూంకి వెళ్లి పడుకున్నాడు. ఉదయం డ్యూటీకి వెళ్లడానికి రూమ్మేట్స్అనిల్ ను నిద్ర లేపగా చనిపోయి ఉన్నాడు. పరీక్షించిన డాక్టర్లు గుండెపోటుతో చనిపోయాడని చెప్పారు. గురువారం అనిల్ మృతదేహం బండ లింగాపూర్ కు చేరుకుంది. మృత దేహాన్ని చూసిన భార్య, ఇద్దరు పిల్లలు భోరున విలపించారు.
కార్మికుడి హత్య కేసులో ఇద్దరి అరెస్ట్
నాలుగు బుల్లెట్లు స్వాధీనం
గోదావరిఖని, వెలుగు: స్థానిక గంగానగర్‌లో ఆగస్టు 20న జరిగిన కొరకోప్పుల రాజేందర్ అనే సింగరేణి కార్మికుడి హత్య కేసులో ఇద్దరు నిందితులను వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీపీ గిరిప్రసాద్ గురువారం వివరాలు వెల్లడించారు. రాజేందర్‌ను కాల్చి చంపిన ప్రధాన నిందితుడు బండం రాజును శ్రీరాంపూర్‌కు చెందిన మాజీ నేరస్తుడు జాడి శ్రీనివాస్ బీహార్‌కు తీసుకెళ్లి తుపాకీ, 20 బుల్లెట్లు కొనిపించడంలో సహయం చేశాడు. ప్రస్తుతం ఇతని వద్ద నుంచి నాలుగు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలో శ్రీనివాస్‌పై వివిధ పోలీస్ స్టేషన్లలో 11 కేసులు నమోదయ్యాయి. అలాగే మరో నిందితుడు మహమ్మద్ వాజిద్ ఏ1 నిందితుడు బండం రాజు, ఏ2 నిందితుడు సయ్యద్ గులాం లతో కలిసి రాజేందర్‌పై గతంలో హత్యా ప్రయత్నం చేశాడు. ఆగస్టు 22న రాజేందర్ భార్య రవళి, బండం రాజు, సయ్యద్ గులాంను పోలీసులు అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న జాడి శ్రీనివాస్‌ను గోదావరిఖని మున్సిపల్ చౌరస్తా వద్ద, వాజిద్‌ను తన ఇంటి వద్ద గురువారం అరెస్టు చేశారు. సమావేశంలో సీఐలు రమేశ్‌బాబు, రాజ్ కుమార్ గౌడ్, ఎస్ఐ సుబ్బారావు పాల్గొన్నారు.