దళిత బాలికపై 64 మంది అకృత్యం..కేరళలో ఐదేండ్ల పాటు ఘోరం

న్యూఢిల్లీ: కేరళలోని పథనంతిట్టలో ఓ దళిత బాలికపై 64 మంది ఐదేండ్ల పాటు లైంగిక దాడి చేశారు. ‘మహిళా సమాఖ్య’ అనే ఎన్జీఓ తన  రొటీన్  ఫీల్డ్  విజిట్​లో భాగంగా బాలికను సంప్రదించగా.. విస్తుపోయే వాస్తవాలను ఆమె వెల్లడించింది. 

తాను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పటి నుంచి (అప్పుడు బాలికకు 13 ఏండ్లు, ఇప్పుడు 18 ఏండ్లు) ఇప్పటి వరకూ తనపై 64 మంది లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె తెలిపింది. ‘‘నాకు 13 ఏండ్లు ఉన్నపుడు మొదటగా మా పొరుగింటి వ్యక్తి నాపై లైంగిక దాడి చేశాడు. 

అతను నాకు పోర్న్  కంటెంట్ ను చూపాడు. క్రమంగా 64 మంది నాపై లైంగిక దాడికి పాల్పడ్డారు. వీడియోలు తీసి షేర్ చేసుకున్నారు. గత ఐదేళ్లుగా నేను తీవ్రమైన మానసిక క్షోభ అనుభవి స్తున్నాను” అని బాధితురాలు ఆ ఎన్జీఓకు వివరించింది. 

దీంతో ఎన్జీఓ సభ్యుల ఫిర్యాదుతో పథనంతిట్ట పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటిదాకా 10 మంది 
నిందితులను అదుపులోకి తీసుకున్నారు.