
- ఢిల్లీలోని పబ్లిక్ పార్క్లోటీనేజ్ బాయ్, గర్ల్ ఉరి
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఓ పబ్లిక్పార్క్లో టీనేజర్ బాలుడు, బాలిక చెట్టుకు ఉరి వేసుకొని అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. దక్షిణ ఢిల్లీలోని హౌజ్ ఖాస్ ప్రాంతంలోని డీర్ పార్క్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పార్క్ సెక్యూరిటీ గార్డ్ ఉదయం 6 గంటల ప్రాంతంలో ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు.
వారు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. 17 ఏండ్ల బాలుడు బ్లాక్ టీ-షర్టు, బ్లూ జీన్స్ వేసుకున్నాడు. బాలిక గ్రీన్ కలర్డ్రెస్ ధరించి ఉంది. ఆ చుట్టుపక్కల ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు చెప్పారు.