- ఒక్కో సెంటర్‌లో సగం కూడా బుక్ కాని స్లాట్స్
- 156 సెంటర్లలో ఒక శాతం వ్యాక్సినేషన్ పూర్తి
- సిటీ పరిధిలో నేటి నుంచి స్పాట్ రిజిస్ట్రేషన్
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్లో సోమవారం నుంచి టీనేజర్లకు వ్యాక్సినేషన్ మొదలైంది. వ్యాక్సిన్ తీసుకునేందుకు మొదటి రోజు పెద్దగా ఇంట్రస్ట్ చూపలేదు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఒక శాతం చొప్పున వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. 3 జిల్లాల్లో మొత్తం 156 సెంటర్లు ఏర్పాటు చేయగా ఒక్కో సెంటర్‌కి 200 నుంచి 500 వరకు స్లాట్స్ ఇచ్చారు. కాగా సోమవారం ఒక్కోదానిలో సగం కూడా బుక్ కాలేదు.
29 వేల మందికి వ్యాక్సిన్ వేయాలని టార్గెట్ పెట్టుకోగా రీచ్ కాలేదు. పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు సెంటర్ల వద్ద అస్సలు రద్దీనే కనిపించలేదు. ఒక్కో సెంటర్‌లో 40 – 50 మందికి మించి వ్యాక్సిన్వేయించుకోలేదని మెడికల్ ఆఫీసర్లు చెప్పారు. ఒకటి, రెండు చోట్ల మాత్రమే 100మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారన్నారు. ఇలాగే కొనసాగితే వ్యాక్సినేషన్ ప్రాసెస్ మార్చే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. నేటి నుంచి సిటీలో స్పాట్ రిజిస్ట్రేషన్ పద్ధతిలో వ్యాక్సిన్ వేయనున్నట్లు డీఎం హెచ్‌వో డాక్టర్ వెంకటి తెలిపారు.
టార్గెట్ రీచ్ కాలే..
15 నుంచి18 ఏండ్లున్న వారు హైదరాబాద్జిల్లాలో 2లక్షల30 వేల మంది, రంగారెడ్డిలో 2.2లక్షల మంది, మేడ్చల్‌లో 1.3లక్షల మంది ఉన్నట్లు హెల్త్ ఆఫీసర్లు గుర్తించారు. సోమవారం హైదరాబాద్‌లో 1,84,822 మంది టీనేజర్లకు వ్యాక్సిన్ వేయాలని టార్గెట్ పెట్టుకోగా మొదటిరోజు 2,265 మంది మాత్రమే తీసుకున్నారు. రంగారెడ్డిలో 1,77,102 మందికి గానూ 1,876 మంది, మేడ్చల్ లో 1,65,618 మందికి గానూ1,902 మంది టీకాలు వేయించుకున్నారు. ఆధార్ కార్డు, స్టూడెంట్ ఐడీలతో వెళ్లిన వాళ్లకు స్పాట్లోనే బుక్ చేసి వాక్సిన్ వేస్తారని చెప్పినా స్పందన లేదు. ఆన్లైన్ స్లాట్బుకింగ్ప్రాసెస్ కారణంగానే రెస్పాన్స్ తగ్గిం
దని మెడికల్ ఆఫీసర్లు చెప్తున్నారు. చాలామంది పిల్లలకు పోర్టల్‌లో లాగిన్ అవడం, వివరాలు నమోదు చేయడం వంటివి తెలియకపోవడం
తోనే ఇలా జరిగిందంటున్నారు.
ప్రాంతాల వారీగా ఇలా..
బన్సీలాల్‌పేట డివిజన్ ఐడీహెచ్ కాలనీ గాంధీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో సోమవారం 11 మంది స్లాట్ బుక్ చేసుకోగా 8 మంది వ్యాక్సిన్తీసుకున్నట్లు మెడికల్ ఆఫీసర్ డా.కిరణ్ తెలిపారు. బోయిగూడ యూపీహెచ్‌సీలో 29 మంది బుక్‌చేసుకుని 22మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. కంటోన్మెంట్, సికింద్రాబాద్పరిధిలోని సెంటర్లలోనూ ఇదే పరిస్థితి. బొల్లారం జనరల్ హాస్పిటల్ సెంటర్‌లో 126 మంది స్లాట్‌బుక్ చేసుకోగా111మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. రసూల్‌పురా సెంటర్‌లో కేవలం 8 మందే వ్యాక్సిన్ వేయించుకున్నారు. సీతాఫల్ మండి , తార్నాక ప్రాంతాల్లో 20 మందికి మించి రాలేదు. శంషాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సెంటర్‌ను ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ప్రారంభించారు.
అందులో 30 మంది, శివరాంపల్లి పీహెచ్సీలో 20 మంది, కాటేదాన్ పీహెచ్సీలో10 మంది, నార్సింగిలో 90 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. పీర్జాదిగూడలో ఏర్పాటు చేసిన సెంటర్‌ను మేయర్ జక్కా వెంకట్ రెడ్డి ప్రారంభించారు. కాప్రా సర్కిల్ జమ్మిగడ్డ సెంటర్‌లో115 మంది టీనేజర్లు వ్యాక్సిన్ తీసుకున్నారు. కూకట్పల్లి సర్కిల్ ఎల్లమ్మబండ పీహెచ్సీలో 30 మంది, శామీర్‌పేటలో 35 మంది వ్యాక్సిన్ తీసుకున్నట్లు డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. అంబర్‌పేటలోని తిలక్‌నగర్ సెంటర్‌లో 15 మందికి వాక్సిన్ వేసినట్లు డాక్టర్దీప్తి చెప్పారు. శంకర్ పల్లిలో మధ్యాహ్నం వరకు కూడా వాక్సినేషన్ స్టార్ట్ కాలేదు. దీంతో టీకాల కోసం వచ్చిన టీనేజర్లు తిరిగెళ్లిపోయారు. షాద్ నగర్‌లోని పీహెచ్‌సీ లో100 మందికి, షాద్ నగర్ గవర్నమెంట్ హాస్పిటల్లో 300 మంది వ్యాక్సిన్ తీసుకున్నారని డిప్యూటీ డీఎంహెచ్‌వో దామోదర్ తెలిపారు. గోల్కొండ ఏరియా హాస్పిటల్‌లోని సెంటర్‌ను ఎమ్మెల్యే కౌసర్
మొయినుద్దీన్ ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లాలో మంగళవారం వ్యాక్సిన్ తీసుకునేందుకు 1100 మంది స్లాట్ బుక్ చేసుకున్నట్లు డీఎంహెచ్‌వో స్వరాజ్య లక్ష్మి తెలిపారు.
మొదట భయపడ్డా..
నేను బంజారాహిల్స్ గవర్నమెంట్ హై స్కూల్ లో టెన్త్చదువుతున్నా. మొదట వ్యాక్సిన్ తీసుకోవాలంటే భయపడ్డా. కానీ టీచర్లు ధైర్యం చెప్పారు. క్లాస్ టీచర్ హెల్ప్‌తో కొవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్నా. - సౌమ్య, టెన్త్ క్లాస్ స్టూడెంట్
వ్యాక్సిన్ తీసుకుంటే బెటర్
వాక్సిన్ తీసుకోవడం హ్యాపీగా ఉంది. టీనేజర్లకు కూడా వ్యాక్సిన్ డ్రైవ్ స్టార్ట్ చేసినందుకు గవర్నమెంట్‌కి థ్యాంక్స్. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి.
- లిఖిత, టెన్త్ స్టూడెంట్, బంజారాహిల్స్