14 వేల ఓట్లతో తీన్మార్ మల్లన్న ముందంజ

14 వేల ఓట్లతో తీన్మార్ మల్లన్న ముందంజ

 నల్గొండ – ఖమ్మం – వరంగల్​ గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్​ అభ్యర్థి తీన్మార్​ మల్లన్న ముందంజలో ఉన్నారు.  ఇప్పటివరకు లక్షా 92 వేల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది.  14 వేల 672 వేల ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నారు. 

కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 34 వేల 575 ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 27 వేల 573 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 12 వేల 841, స్వతంత్ర అభ్యర్థి 11 వేల 118 ఓట్లు పడ్డాయి. ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది.