తీన్మార్ మల్లన్నకు గెస్టు లెక్చరర్ల మద్దతు

హైదరాబాద్, వెలుగు: వరంగల్, ఖమ్మం,  నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మద్దతిస్తున్నట్టు జూనియర్ కాలేజీల గెస్టు లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్, కార్యదర్శి దార్ల భాస్కర్ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. పదేండ్లుగా సర్కారు  జూనియర్ కాలేజీల్లో చాలీచాలని వేతనాలతో, ఉద్యోగ భద్రత లేకుండా పనిచేస్తున్నట్టు చెప్పారు. గెస్టు లెక్చరర్ల సమస్యల పరిష్కారానికి తీన్మార్ మల్లన్న దృష్టికి తీసుకుపోయామన్నారు. దీంతో సర్కారుతో మాట్లాడి తప్పకుండా న్యాయం చేస్తామని మల్లన్న హామీ ఇచ్చారని తెలిపారు. కాగా..గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నకు సంపూర్ణ మద్దతిస్తున్నట్టు టీఎస్​పీటీఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు షౌకత్ అలీ, పిట్ల రాజయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైమరీ టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మల్లన్న హామీ ఇచ్చారని గుర్తుచేశారు.