
సీఎం రేవంత్ రెడ్డి చెబితే కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, క్యాస్ట్ సెన్సెస్ చేసి బీసీ లకు 54 శాతం రిజర్వేషన్లు ఇస్తామని రాహుల్ గాంధీ ఇచ్చిన మాటతో పార్టీలో చేరానని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. తనను సస్పెండ్ చేసినంత మాత్రాన పోరాటం ఆగదని అన్నారు. సీఎం రేవంత్ తనను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపినంత మాత్రాన బీసీ పోరాటం ఆగదుగదని, బీసీలకు రాజ్యాధికారం ఎట్లా రాదో చూస్తానని సవాల్ విసిరారు.
కులగణన చిత్తు కాగితాలని, తగలబెట్టడం తప్పైతే.. బీసీల కోసం ఇంకా వెయ్యి సార్లు తగలేబట్టి తప్పు చేస్తానని అన్నారు. కులగణన చేసే క్రమంలో సీఎం కు సూచనలు చేశామని, కానీ పట్టించుకోలేదని తెలిపారు. సర్వే దేశానికి ఆదర్శంగా ఉండాలనీ.. రాహుల్ గాంధీ తలెత్తి చెప్పే లాగా ఉండాలని చెప్పానని కాని తన మాట లెక్కచేయలేదని అన్నారు.
ALSO READ : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. విదేశాల్లో ఉన్న నిందితులపై రెడ్ కార్నర్ నోటీస్..
ప్రస్తుత సర్వే అణగారిన వర్గాలను తొక్కి పెట్టె సర్వే అని, అగ్రవర్ణాల వారి లెక్క ఎక్కువ చేసి చూపించారని ఆరోపించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రక్షించడం కోసమే సర్వే ఎత్తుగడ అని పేర్కొన్నారు.