
మాజీ మంత్రి కేటీఆర్,హరీశ్ రావులపై తీన్మార్ మల్లన్న విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు హరీశ్ రావు, కేటీఆర్ లు బిల్లా- రంగళ్లుగా తయారయ్యారని సెటైర్ వేశారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మల్సీఎన్ రోల్డ్ సమావేశంలో పాల్గొన్నారు తీన్మార్ మల్లన్న .
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. పదవి పోయినా కేటీఆర్ కు అహంకారం తగ్గలేదని విమర్శించారు. కరెంటు బిల్లులు సోనియాకు పంపాలన్న కేటీఆర్.. కాళేశ్వరం బిల్లులు మీ ఇంటికి పంపాలా అంటూ ప్రశ్నించారు. ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పినా కేటీఆర్ కు మారడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా కాకముందే హామీల గురించి అడుగుతున్న కేటీఆర్..10ఏళ్లలో మీరిచ్చిన హామీల సంగతి చెప్పాలన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండు గ్యారీంటీలను నెరవేర్చిందన్నారు.