ఇజ్రాయిల్ ఇస్ఫాహాన్‌లో వైమానిక దాడి చేయలేదని ఇరాన్ తెలిపింది. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్ పై ఇజ్రాయిల్ క్షిపణి దాడి చేసిందని అమెరికా మీడియా సంస్థ వెల్లడించింది. ఆ వార్తపై ఇరాన్ అధికారి స్పందించారు. ఇరాన్ లో ఎయిర్ డిఫెన్స్ యాక్టివేట్ చేయడం వల్ల ఇస్ఫాహాన్‌లో పేలుడు సంభవించిందని ఆయన ప్రకటించారు. ఇరాన్‌పై ఎటువంటి క్షిపణి దాడి జరగలేదని ఇరాన్ అధికారి అన్నారు.
ఇజ్రాయిల్ శుక్రవారం తెల్లవారుజామున 5గంటలకు ఇరాన్ పై ఎయిర్ స్ట్రైక్స్ చేసినట్లు ఓ మీడియా సంస్థ ప్రకటించింది. టెహ్రాన్‌పై క్షిపణి దాడి జరగలేదని ఇరాన్ అధికారి వార్తా సంస్థ రాయిటర్స్‌తో చెప్పారు. ఈరోజు ఉదయం టెహ్రాన్, ఇస్ఫహాన్, షిరాజ్ విమానాశ్రయాలతో సహా అనేక ప్రాంతాలలో ఇరాన్ విమానాలను నిలిపివేసింది. పశ్చిమ ఇరాన్ చుట్టూ అనేక విమానాలు దారి మళ్లించబడ్డాయి. ఇరాన్ లో వైమానిక రక్షణ వ్యవస్థ యాక్టవేట్ చేయడం వల్లే అందులో జరిగిన పొరపాటు వల్ల పేలుడు సంభవించిందని ఇరాన్ తెలిపింది.