చెక్ పోస్టుల దగ్గర రూలింగ్పార్టీ డబ్బుల విషయంలో చూసీచూడనట్టు ఉండుమంటున్నడు
సీనియర్ అసిస్టెంట్ మోహన్
కోల్‌బెల్ట్, వెలుగు : మందమర్రి తహసీల్దార్ చంద్రశేఖర్ తనను బీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరించాలని ఒత్తిడి చేస్తున్నాడని, చెక్ పోస్టుల దగ్గర రూలింగ్ పార్టీ డబ్బుల విషయంలో చూసీచూడనట్టు ఉండాలని బెదిరిస్తున్నాడని సీనియర్అసిస్టెంట్ మోహన్ఆరోపించారు. మహిళా ఉద్యోగి బర్త్‌డే వేడుకలను ఆఫీసులో చేయడాన్ని నిరాకరించినందుకు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని తెలిపారు. శుక్రవారం తహసీల్దార్ ఆఫీస్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అక్టోబర్ 29న తహసీల్దార్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆఫీసులో ఆర్ఐ పద్మజ బర్త్‌డే వేడుకలు నిర్వహించగా, భోజనాలను బీఆర్ఎస్ లీడర్లు పంపించారు.
ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున ఆ భోజనం అవసరం లేదని నిరాకరించాను. ఈ విషయమై కక్ష పెంచుకొని నన్ను కలెక్టరేట్‌కు సరెండర్ చేస్తున్నానని, గెట్అవుట్అంటూ వెళ్లగొట్టాడు’ అని మోహన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘తహసీల్దార్ చంద్రశేఖర్.. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దగ్గర పీఏగా, గతంలో కలెక్టర్ దగ్గర సీసీగా పనిచేశాడు. ఈ విషయాలను చెబుతూ తలుచుకుంటే ఏమైనా చేయగలనని బెదిరిస్తున్నాడు’ అని వాపోయాడు. చెక్ పోస్టుల దగ్గర అధికార పార్టీ లీడర్ల డబ్బులను చూసీచూడనట్టు ఉండాలని ఒత్తిడి చేస్తున్నాడని ఆరోపించారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశానన్నారు.
ఆరోపణలు అవాస్తవం: తహసీల్దార్
సీనియర్ అసిస్టెంట్ మోహన్ ఆరోపణలు అవాస్తవమని తహసీల్దార్ చంద్రశేఖర్ వివరణ ఇచ్చారు. ఆఫీసులో సూచించిన పనులను మోహన్ చేయడం లేదని, డ్యూటీలో చేరి నెలవుతున్నా ఒక ఫైల్ కూడా పూర్తి చేయలేదన్నారు. పని చేయమన్నందుకే ఆరోపణలు చేస్తున్నాడన్నారు. ఆఫీసులో బర్త్ డే వేడుకలు చేయడం తప్పేమీ కాదన్నారు.