Mirai Release Update: తేజ సజ్జ మిరాయ్ రిలీజ్ వాయిదా.. అదే కారణమా..?

Mirai Release Update: తేజ సజ్జ మిరాయ్ రిలీజ్ వాయిదా.. అదే కారణమా..?

హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ఈసారి "మిరాయ్"తో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాని జపాన్ మార్షల్ ఆర్ట్స్ జోనర్ లో యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. టాలీవుడ్ మరో ప్రముఖ హీరో మంచు మనోజ్ కూడా ఈ సినిమాలో తేజ సజ్జతో కలసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఇందులోభాగంగా మంచు మనోజ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఆమధ్య ఈ ఇద్దరి హీరోల గ్లింప్స్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఈ సినిమాని గతంలో ఈ ఎడాది జూన్ నెలలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జూన్ నుంచి ఆగస్టు 1కి పోస్ట్ పోన్ అయ్యింది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన కీలకమైన షెడ్యూల్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. అలాగే సీజీ వర్క్స్ కూడా పూర్తి కానట్లు సమాచారం. అందుకే మిరాయ్ జూన్ నుంచి ఆగస్టు కి వాయిదా పడినట్లు టాక్ వినిపిస్తోంది.

Also Read : ఇంట్రెస్టింగ్ గా ఓదెల 2 ట్రైలర్

ఈ విషయం ఇలా ఉండగా హీరో తేజ సజ్జకి హనుమాన్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ వచ్చింది.. దీంతో మిరాయ్ సినిమాని పాన్ ఇండియా భాషలతోపాటూ జపాన్, చైనా, ఇంగ్లీష్ భాషలలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. మేకింగ్ పరంగా కూడా ఇంటర్ నేషనల్ స్టాండర్డ్స్ మెయింటేన్ చేస్తూ సీన్స్ ని తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు డబ్బింగ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.