తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఏర్పాటు

తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఏర్పాటు
  • రాష్ట్రంలోని 65 సంఘాలతో కొత్త జాయింట్ యాక్షన్ కమిటీ 
  • ఉద్యోగుల సంక్షేమం, స‌‌మ‌‌స్యల ప‌‌రిష్కారం కోసం కృషి చేస్తామని వెల్లడి
  • చైర్మన్​గా వి.లచ్చిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటైంది. డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి  చైర్మన్ గా ఉద్యోగుల జేఏసీ ఏర్పడింది. హైదరాబాద్​లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, సీపీఎస్, పెన్షన్, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగ సంఘాల సమావేశం జరిగింది. ఈ మీటింగ్​లో 65 సంఘాల నాయకులు ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం చైర్మన్​ ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చ్చిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఏకతాటిపైకి తెచ్చి.. ప్రజా ప్రభుత్వంలో వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారమే లక్ష్యంగా జేఏసీని ఏర్పాటు చేసుకున్నట్టు తెలిపారు. 

గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌త బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల విష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యంలో జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిగిన పొర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాట్లు, ఉద్యోగుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిగిన అన్యాయాలు పున‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావృతం కానివ్వమన్నారు. 610 జీవో అన్యాయంపై పోరాడి తెలంగాణ తెచ్చుకుంటే, వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చ్చిన తెలంగాణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 317 జీవో కింద 50 వేల ఉద్యోగాలు పోతున్నా ఆ సంఘాలు ఒక్క మాట మాట్లాడ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లేదని ఆయన మండిపడ్డారు. ఉద్యోగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆర్టీసీ కార్మిక సంఘాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్వీర్యం చేసినా, ఆర్టీసీ, ఉద్యోగ నాయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇబ్బందిపెట్టినా ఆ సంఘాలు మాట్లాడ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లేదని విమర్శించారు. గతంలో ఆర్టీసీ కార్మికులు మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణించినా ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్టించుకోని సంఘాలు.. ఇప్పుడు ఉద్యోగుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు న్యాయం చేస్తామంటున్నాయని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో స్వేచ్ఛ దొరికింద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని బ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌య‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కువ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్తున్నాయని పేర్కొన్నారు. తాము ఆ సంఘాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పోటీగా ముందుకు రావ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డం లేదన్నారు. వారిలా రాచ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రికంలా ఉండొద్దని, ఉద్యోగుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్టించుకోకుంటే కుద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని చెప్పేందుకే ముందుకొచ్చామని లచ్చిరెడ్డి స్పష్టం చేశారు. 

డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లవారీగా స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్యల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిష్కారానికి కృషి 

ఉద్యోగుల హెల్త్, హౌసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెల్ఫేర్ వంటి వివిధ అంశాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై స్పెషల్ క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మిటీలు వేస్తామని చైర్మన్​ ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చ్చిరెడ్డి  తెలిపారు. డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లవారీగా ఉద్యోగుల స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్యల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పూర్తిస్థాయిలో తెలుసుకొని అంద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రి అభిప్రాయాలతో విధి విధానాలు రూపొందిస్తామని తెలిపారు. వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయాలు వచ్చేలా చూస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులు అశ్వత్థామ రెడ్డి, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు నిర్మల, లక్ష్మారెడ్డి, సంపత్ కుమార్, హర్షవర్ధన్ రెడ్డి, కుమారస్వామి, మైపాల్ రెడ్డి, షౌకత్ అలీ, శ్రీకాంత్, గరిక ఉపేందర్ రావు, గోపాల్ రెడ్డి, కే రామకృష్ణ, ఎస్ రాములు, రమేశ్ పాక, ఫుల్ సింగ్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.