త్వరలో ఆర్మీలోకి ‘తేజస్ ఎన్’

త్వరలో ఆర్మీలోకి ‘తేజస్ ఎన్’

మేడ్ ఇన్ ఇండియా!

రెడీ అవుతున్న ఫైటర్ జెట్
ప్రస్తుత డిజైన్లను డెవలప్ చేసేందుకు పర్మిషన్
ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై ట్రయల్ ల్యాండింగ్ పూర్తి
అరెస్టె‌డ్ ల్యాండింగ్స్, టేకాఫ్స్ కూడా సక్సెస్

న్యూఢిల్లీ: మేడ్ ఇన్ ఇండియా ఫైటర్ జెట్ రెడీ అవుతోంది. ప్రొటోటైప్ ‘తేజస్ ఎన్’ యుద్ధవిమానం.. ఇప్పటికే కొన్ని టెస్టులు పాస్ అయింది. నేవీ ఎయిర్​క్రాఫ్ట్ క్యారియర్ ‘ఐఎన్ఎస్ విక్రమాదిత్య’పై జరిపిన ట్రయల్ ల్యాండింగ్స్ సక్సెస్ అయ్యాయి. దేశంలోనే తయారు చేసిన ‘తేజస్ ఎన్’.. వచ్చే ఆరేళ్లలో ఎయిర్​ఫోర్స్​లోకి చేరనుంది. రెండు ఇంజిన్లతో కూడిన ఈ ఫైటర్ జెట్​ను డెవలప్ చేసేందుకు ఎయిరోనాటికల్ డెవలప్​మెంట్ ఏజెన్సీ (ఏడీఏ) కూడా అనుమతి ఇచ్చింది. తేజస్ ఫైటర్​ప్రిన్సిపల్ డిజైనర్ కూడా ఏడీఏనే. రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​తో గతనెల ఆఖర్లో జరిగిన సమావేశంలో ఏడీఏ ఈ మేరకు ‘తేజస్​ఎన్’​పై చర్చించింది. ఈ మీటింగ్ తర్వాతే కొత్త ఫైటర్ విమానం తయారీకి సంబంధించిన ఆపరేషనల్ రిక్వైర్​మెంట్స్ (ఓఆర్)ను డిఫెన్స్ మినిస్ర్టీ ఇంటిగ్రేటెడ్ హెడ్ క్వార్టర్స్ జారీ చేసింది.

రెండు ప్రోటో టైప్ జెట్లు

ఈ ప్రొటోటైప్ ఫైటర్ జెట్​ను ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ లపై మోహరించేందుకు డిజైన్ చేశారు. వచ్చే ఆరేళ్లలో దీన్ని పూర్తిగా అందుబాటులోకి తీసుకురానున్నారు. తేజస్ ఎన్ ప్రోటోటైప్ డిజైన్​ను దేశీయంగా తయారు చేశారు. ఇందులో రెండు ఇంజన్లు ఉంటాయి. ఇప్పటికే పరీక్షల్లో పాస్ అయింది. గోవా తీరంలోని ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై ల్యాండ్ అయింది. అరెస్టెడ్ ల్యాండింగ్స్, టేకాఫ్స్​ను సక్సెస్​ఫుల్​గా పూర్తి చేసుకుంది. రెండు ప్రోటోటైప్ జెట్లు ఈ మేరకు సిద్ధమయ్యాయి.

మూడు వేరియంట్లపై స్టడీ

ఐఏఎఫ్ అడ్వాన్స్‌‌‌‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ) కోసం అభివృద్ధి చేస్తున్న టెక్నాలజీలను ఈ కొత్త జెట్ లో ఏర్పాటు చేయొచ్చని ఈ ప్రోగ్రామ్​లో పాల్గొన్న ఎక్స్​పర్టులు అన్నారు. ఈ ప్రోటోటైప్ జెట్ డిజైన్లు మరింత నమ్మకమైనవని చెప్పారు. ఫైటర్ డిజైన్​కు సంబంధించి కనీసం మూడు వేరియంట్లను ప్రస్తుతం స్టడీ చేస్తున్నట్లు వెల్లడించారు. కొత్త జెట్లు అందుబాటులోకి వస్తే.. మన ఎయిర్ కెపాసిటీ పెరుగుతుంది. అలాగే మిగ్ 29కే స్థానాన్ని కూడా భర్తీ చేస్తుంది. 2025లో తేజస్ ఎంకే2ను ఎయిర్​ఫోర్స్​లోకి తీసుకురానున్నారు. దీనికంటే ‘తేజస్ ఎన్’ ఎంతో భిన్నంగానూ, సుపీరియర్​గానూ ఉంటుందని చెబుతున్నారు.

ఇవీ స్పెషాలిటీస్

ట్విన్ ఇంజిన్ ఫైటర్ జెట్

కనీసం ఆరు ఎయిర్ ​టు ఎయిర్​మిసైళ్లను ఇందులో అమర్చవచ్చు.

సుమారు 2 గంటలపాటు ఆపరేషనల్ ఎండ్యూరెన్స్ ఉంటుంది.

పూర్తిగా భిన్నమైన యుద్ధ విమానంగా క్లాసిఫై చేశారు.

బోయింగ్ ఎఫ్/ఏ-18ఈ/ఎఫ్ సూపర్ హార్నెట్, రాఫెల్ విమానాల పనితీరు బెంచ్​మార్క్​ను అందుకుంది.

For More News..

మళ్లీ నీళ్ల లొల్లి

అయినకాడికి అమ్ముకోండి

డిప్రెషన్‌‌లో చిక్కుకుని చావాలనుకున్నా

మారటోరియంలో వడ్డీ వసూలు చేయకూడదు!