వనపర్తి, వెలుగు: గ్రామ పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల కోసం ఓటరు జాబితాలను తప్పులు లేకుండా తయారు చేయాలని ఆఫీర్లను కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో స్పెషల్ సమ్మరి రివిజన్ –2024 పై తహశీల్దార్లు, డీటీలు, బీఎల్ ఓలు, సూపర్ వైజర్లతో ఓటరు జాబితా తయారుపై సమీక్ష నిర్వహించి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ జనవరి 1, 2024 నాటికి 18 ఏళ్లు నిండిన యువతకు ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేయించాలని ఆదేశించారు. అవసరమైన చోట కొత్త పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలుపంపాలన్నారు. జనవరి 6 న ముసాయిదా జాబితా ప్రచురించాలని, 6 నుంచి జనవరి 22 వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుందన్నారు. ఫిబ్రవరి 2 వరకు అన్ని ఫిర్యాదులు పరిష్కరించి ఫిబ్రవరి6న తుది జాబితాను ప్రచురణ కోసం కమిషన్ కు పంపించాలన్నారు. 2024 ఫిబ్రవరి 8న ఓటరు తుది జాబితా ప్రకటిస్తారన్నారు. సమావేవంలో అడిషనల్ కలెక్టర్ తిరుపతి రావు పాల్గొన్నారు.