
పాట్నా: హోలీ రోజు ముస్లింలు బయటకు రావొద్దని బీజేపీ ఎమ్మెల్యే ఒకరు చేసిన కామెంట్లపై ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ ఫైర్ అయ్యారు. బిహార్ రాష్ట్రం ఆ ఎమ్మెల్యే తండ్రి జాగీర్ కాదని మండిపడ్డారు. ఇలాంటి ప్రకటనలు చేయడానికి అతను ఎవరని ప్రశ్నించారు. మార్చి 14న హోలీ పండుగ కావడం, అదేరోజు రంజాన్ నెల మొదటి శుక్రవారం కావడంతో బీజేపీ బిహార్ ఎమ్మెల్యే హరిభూషణ్ ఠాకూర్ బచౌల్ స్పందించారు. ఘర్షణలు నివారించేందుకు హోలీ పండుగ రోజు ముస్లింలు ఇంట్లోనే ఉండాలన్నారు.
‘హోలీ ఏడాదికి ఒకసారే వస్తుంది. ఏడాదికి 52 సార్లు వచ్చే జుమ్మా(శుక్రవారం)లలో ఒకదానిని హిందువులకు వదిలేయండి’ అని హరిభూషణ్ అన్నారు. హరిభూషణ్ కామెంట్లపై తేజస్వీ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ముస్లిం సోదరులను బయటకు రావద్దని బీజేపీ ఎమ్మెల్యే కోరారు. ఇది ఆయన తండ్రి రాష్ట్రామా? ఆయనెవరు? ఇలాంటి ప్రకటన ఎట్లా చేస్తాడు” అని ప్రశ్నించారు.