
న్యూఢిల్లీ: ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలను కలిశారు. మంగళవారం ఢిల్లీలో వేర్వేరుగా వారితో సమావేశయ్యారు. ఈ మీటింగ్ లో ఆర్జేడీ ఎంపీలు మనోజ్ ఝా, సంజయ్ యాదవ్ కూడా పాల్గొన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మహా ఘట్ బంధన్ సన్నద్ధత గురించి చర్చించినట్టు తెలుస్తోంది.
అనంతరం తేజస్వీ యాదవ్ మీడియాతో మాట్లాడారు. మహా ఘట్ బంధన్ సీఎం అభ్యర్థిపై ఊహాగానాలు చేయొద్దని ఆయన మీడియాను కోరారు. “సీఎం అభ్యర్థిపై అందరం మాట్లాడుకొని ఒక నిర్ణయానికొస్తం. ఈ విషయం గురించి అందరికీ స్పష్టత ఉంది. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని తెలిపారు. జేడీయూ ప్రెసిడెంట్ నితీశ్ కుమార్ ను బీజేపీ హైజాక్ చేసిందని ఆరోపించారు.