నితీశ్‎తో పొత్తు ప్రసక్తే లేదు.. తేల్చిచెప్పిన తేజస్వీ యాదవ్

నితీశ్‎తో పొత్తు ప్రసక్తే లేదు.. తేల్చిచెప్పిన తేజస్వీ యాదవ్

పాట్నా: బిహార్ సీఎం నితీశ్ కుమార్‎తో మళ్లీ పొత్తు పెట్టుకునే ప్రసక్తేలేదని ఆర్జేడీ లీడర్​తేజస్వీ యాదవ్ తేల్చిచెప్పారు. గతంలో పొత్తు కోసం నితీశే తమ వద్దకు వచ్చారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో నితీశ్ తోలుబొమ్మగా మారారని, కొంతమంది బీజేపీ నేతలే ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆరోపించారు. మంగళవారం ఓ టీవీ చానెల్‏తో ఆయన మాట్లాడారు. ‘‘వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్‎తో మళ్లీ పొత్తు పెట్టుకోం. ఇప్పటికే పలుమార్లు అవకాశం ఇచ్చాం. బీజేపీలోకి వెళ్లి మళ్లీ మా వద్దకు వచ్చి అసెంబ్లీలో ఆయన క్షమాపణ చెప్పారు. మళ్లీ బీజేపీలోకి వెళ్లారు. ఇన్నిసార్లు పార్టీ మారిన వ్యక్తితో మళ్లీ పొత్తు ఏంటి?” అని తేజస్వీ కామెంట్ చేశారు.