పాక్ వెళ్లి మోడీ బిర్యానీ తినొచ్చు.. టీమిండియా మాత్రం ఆ దేశం వెళ్లొద్దా..? తేజస్వీ యాదవ్

పాక్ వెళ్లి మోడీ బిర్యానీ తినొచ్చు.. టీమిండియా మాత్రం ఆ దేశం వెళ్లొద్దా..? తేజస్వీ యాదవ్

పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫిలో టీమిండియా పాల్గొంటుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. పాక్ వేదికగా టోర్నీ నిర్వహిస్తే మేం ఆడబోమని భారత్ తేల్చి చెప్పడంతో టోర్నీ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. టీమిండియా కోరిక మేరకు ఐసీసీ టోర్నీని హైబ్రిడ్ మోడల్‎లో నిర్వహిస్తుందా..? లేక టోర్నీ మొత్తం పాక్‎లోనే కండక్ట్ చేసేందుకు మొగ్గు చూపుతుందా అని ఐసీసీ డెసిషన్‎పై క్రికెట్ వర్గా్ల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో టీమిండియా పాక్‎లో పర్యటించేందుకు నిరాకరించడంపై బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

ప్రధాని మోడీ పాకిస్థాన్‎లో పర్యటించి బిర్యానీ తింటారు.. అలాంటప్పుడు టీమిండియా ఆ దేశం ఎందుకు వెళ్లకూడదని ప్రశ్నించారు. వివిధ దేశాలు పాల్గొనే ఐసీసీ టోర్నమెంట్‌కు భారత జట్టు ఎందుకు సరిహద్దు దాటి పాక్‎కు వెళ్లకూడదని కేంద్ర ప్రభుత్వాన్ని  నిలదీశారు. రాజకీయాలను క్రీడలకు ముడిపెట్టొదని.. క్రీడలను పాలిటిక్స్ దూరంగా ఉంచాలని కోరారు. ఆటలో భాగంగా పాకిస్థాన్ ప్లేయర్స్ ఇక్కడికి రావాలి.. మన ఆటగాళ్లు అక్కడికి వెళ్లాలని సూచించారు. క్రీడల్లో రెండు దేశాల మధ్య యుద్ధాలు ఏం జరగడం లేదు కదా అని వ్యాఖ్యానించారు. 

ALSO READ | ‘హైబ్రిడ్‌’కు ఓకేనా? నేడు తేలనున్న చాంపియన్స్‌ ట్రోఫీ భవితవ్యం

కాగా, ప్రధాని హోదాలో ప్రధాని మోడీ 2015లో పాకిస్థాన్ లోని లాహోర్ నగరంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధానితో కలిసి మోడీ విందు చేశారు. ఈ పర్యటనను ఉద్దేశిస్తూ తేజస్వీ యాదవ్ పై విధంగా కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే.. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న కారణంగా భారత క్రికెట్ జట్టు చివరిసారిగా 2008లో పాకిస్థాన్‎లో పర్యటించింది. ఇక అప్పటి నుండి టీమిండియా మళ్లీ భారత్‎కు వెళ్లలేదు. చిరకాల ప్రత్యర్థులు చివరిసారిగా 2012-13లో భారత్‌లో ద్వైపాక్షిక సిరీస్ ఆడారు. ఇరు దేశాల మధ్య ఇదే చివరి ద్వైపాక్షిక సిరీస్. ఇక, అప్పటి నుండి భారత్, పాక్ కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి.