బీహార్ ఓటర్లు తేజస్వీ వైపే!

బీహార్ ఓటర్లు తేజస్వీ వైపే!
  • హంగ్​కూ అవకాశం లేకపోలేదన్న ఎగ్జిట్​ పోల్స్
  • ముగిసిన ఎన్నికల పోరు, 10న రిజల్ట్​

బీహార్​లో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మహాకూటమికే అధికారం దక్కనుందని అంచనా వేశాయి. అయితే ఎన్డీయే, మహాకూటములు గెల్చుకునే సీట్ల మధ్య తేడా చాలా తక్కువని, కాస్త అటూఇటైతే హంగ్​ ఏర్పడే అవకాశమూ లేకపోలేదని తేల్చిచెబుతున్నాయి. మూడు దశల్లో సాగిన పోలింగ్​లో తేజస్వీ యాదవ్​కే యువత జై కొట్టిందని పేర్కొన్నాయి.

పాట్నాబీహార్​లో మెజారిటీ ఎగ్జిట్​ పోల్స్​ మహాకూటమికే అధికారం దక్కనుందని అంచనా వేశాయి. ఈ ఎన్నికల పోరులో ఎన్డీఏతో జతకట్టిన నితీశ్​ కుమార్​ వెనకబడ్డారని చెప్పాయి. అయితే, రెండు కూటములు గెల్చుకునే సీట్ల మధ్య తేడా చాలా తక్కువని, కాస్త అటూఇటైతే హంగ్​ ఏర్పడే అవకాశమూ లేకపోలేదని తేల్చిచెబుతున్నాయి. మూడు దశల్లో సాగిన పోలింగ్​లో తేజస్వీ యాదవ్​కే యువత జై కొట్టిందని పేర్కొన్నాయి. ఈమేరకు శనివారం సాయంత్రం మూడో దశ పోలింగ్​ ముగియగానే ఎగ్జిట్​ పోల్స్ వెలువడ్డాయి. టైమ్స్​ నౌ–సీ ఓటర్, పీపుల్స్ పల్స్, రిపబ్లిక్​ జన్​కీ బాత్, ఏబీపీ న్యూస్​ తదితర సంస్థలు తమ సర్వే వివరాలను వెల్లడించాయి. దాదాపుగా అన్ని సంస్థలూ మహాకూటమికే కొంత మొగ్గు ఉందని తేల్చాయి. ఎల్జేపీ గెల్చుకునే సీట్ల సంఖ్య రెండంకెలు దాటే పరిస్థితి లేదని దాదాపుగా అన్ని సర్వేల్లోనూ తేలింది. సీఎంగా నితీశ్​ కుమార్​ కన్నా తేజస్వీ యాదవ్​కే ప్రజల మద్దతు ఎక్కువని తెలిపాయి. సీఎంగా ఎవరుండాలనే ప్రశ్నకు తేజస్వీకి 44%, నితీశ్​కు 35% మంది ఓటేశారని ఇండియా టుడే సర్వే వెల్లడించింది.

మ్యాజిక్ మార్కు దాటేదెవరు?

రాష్ట్రంలోని 243అసెంబ్లీ సీట్లకు 3 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో జేడీయూ, బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ మరోసారి అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉంది. కాంగ్రెస్, లెఫ్ట్​ పార్టీలతో ఆర్జేడీ ఏర్పాటు చేసిన మహాకూటమి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కృషి చేస్తోంది. మరోవైపు, ఎల్జేపీ చీఫ్​ చిరాగ్​ పాశ్వాన్​ ఒంటరిగా బరిలోకి దిగారు. 243 అసెంబ్లీ సీట్లున్న బీహార్​లో 122 సీట్లు గెల్చుకున్న పార్టీ(కూటమి) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలో వరుసగా నాలుగో సారి కూడా నితీశ్​ కుమార్​ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా.. ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో తేజస్వీ యాదవ్​ సీఎం కుర్చీలో కూర్చుంటారా.. రెండు కూటములకూ స్పష్టమైన మెజారిటీ రాకుండా హంగ్​ ఏర్పడితే చిరాగ్​  చక్రం తిప్పే పరిస్థితి వస్తుందా.. అనేది ఈ నెల 10 న తేలనుంది.