- సహాయం చేసినందుకు ధన్యవాదాలు తెలిపిన పవర్ లిఫ్టర్
హైదరాబాద్, వెలుగు: ఇంటర్నేషనల్ ప్లేయర్, పవర్ లిఫ్టర్ తేజావత్ సుకన్య గురువారం సెక్రటేరియెట్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని కలిశారు. వరల్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో పాల్గొనేందుకు తనకు సహాయం చేసినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అమెరికాలోని టెక్సస్ లో మే 20 నుంచి జూన్ 2 వరకు వరల్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ జరిగింది. మహబూబాబాద్ కు చెందిన తేజావత్ సుకన్య ఈ చాంపియన్ షిప్ లో పాల్గొనేందుకు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ నుంచి మంత్రి సహాయం చేశారు. వచ్చే నెలలో సౌతాఫ్రికాలో జరిగే ఏషియా, ఆఫ్రికా, పసిఫిక్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీలకు వెళ్లడానికి సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.