కేసీ వేణుగోపాల్ నివాసంలో రాష్ట్ర ముఖ్య నేతల సమావేశం

  • రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన, సంస్థాగత అంశాలపై చర్చ
  • హాజరైన సీఎం, డిప్యూటీ సీఎం,పీసీసీ చీఫ్, మంత్రులు

న్యూఢిల్లీ, వెలుగు: త్వరలో తెలంగాణలో లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ పర్యటనపై రాష్ట్ర నాయకత్వం చర్చలు జరిపింది. ఇందులో భాగంగా బుధవారం ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ నివాసంలో రాష్ట్ర ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఈ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. దాదాపు 45 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన, సంస్థాగత అంశాలపై చర్చించారు. అలాగే, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను కేసీ వేణుగోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వివరించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల అమలు, సీఎం సింగపూర్, దావోస్ పర్యటనపై చర్చించారు. ఈ పార్ములా కేసు వ్యవహారంలో కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఏసీబీ, ఈడీ దాఖలు చేసిన కేసులు, ఇతర పొలిటికల్ అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది.