Rain alert: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఎప్పటి నుంచి అంటే..

Rain alert: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఎప్పటి నుంచి అంటే..

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. తదుపరి 24 గంటలలో ఈ వాయుగుండం తీవ్రతను కొనసాగిస్తుందని వాతావరణశాఖ పేర్కొంది. ఏపీలోని పలు జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది. ఇక తెలంగాణలో డిసెంబర్ 24 నుంచి వానలు కురిసే అవకాశం ఉంది.

 తెలంగాణకు వాతావరణశాఖ వర్ష సూచన ఇచ్చింది. . అయితే డిసెంబర్ 24వ తేదీ నుంచి రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉందని ఐఎండీ  తెలిపింది.ఈ అల్పపీడనం రాబోయే 12 గంటల్లో ఉత్తరం వైపు కదులుచూ పశ్చిమ మధ్య బంగాళాఖాతాంలో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆ తదుపరి 24 గంటల్లో వాయుగుండం తీవ్రతతో కొనసాగుతుందని పేర్కొంది. 

అల్పపీడనం, వాయుగుండం ప్రభావం నేపథ్యంలో తెలంగాణకు వర్ష సూచన ఇచ్చింది ఐఎండీ.డిసెంబర్ 24వ తేదీ నుంచి తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పలుచోట్ల పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.  డిసెంబర్ 26వ తేదీ వరకు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.