ఊర్లు చెరువులైనయ్.. టౌన్లు నదులైనయ్..

ఊర్లు చెరువులైనయ్.. టౌన్లు నదులైనయ్..

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఊర్లు చెరువులను తలపిస్తుండగా.. పట్టణాలు నదుల్లా మారిపోయాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు వర్షాలకు చిగురుటాకులా వణికుతున్నాయ్. వరంగల్​లోని చాలా కాలనీల్లో పీకల్లోతు నీరు నిలిచి ఉండటంతో  అధికారులు బోట్ల సాయంతో పబ్లిక్ కు సాయం చేస్తున్నారు. 

ఎన్టీఆర్ నగర్, బాలాజీ నగర్, రాంనగర్, మెదరి వాడ కాలనీల్లో ఇండ్లలోకి వరద నీరు చేరాయి. పెద్దపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు సరస్వతీ పంప్​హౌస్​కి వరద నీరు చుట్టూ ముట్టింది. ప్రస్తుతం 13.760 మీటర్ల ఎత్తులో గోదావరి నది ప్రవహిస్తోంది.

ALSO READ :13 గంటల టెన్షన్​కు తెర.. తిరిగొచ్చిన పర్యాటకులు

రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో వరద నీరు రోడ్డుపై నుంచి ప్రవహిస్తోంది. మిర్యాలగూడ మీదుగా ట్రాఫిక్​ మళ్లిస్తుండగా భారీగా ట్రాఫిక్​జామ్​ అయింది.  మొరంచవాగులో నలుగురు గల్లంతుకాగా ఇప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. 

అదే ఊళ్లో 100కు పైగా పశువులు మృతి చెందాయి. మంచిర్యాల పట్టణంలోకూడా లోతట్టు కాలనీలు మునిగిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఇండ్లలోకి వరద వస్తోందని ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్​ జిల్లా నేరడిగొండ మండలం కుమారి గ్రామంలో రాత్రి రోడ్డుపై భారీ కొండ చిలువ కనిపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.