పదో తరగతి పుస్తకాలపై వివాదం

పదో తరగతి పుస్తకాలపై వివాదం

తెలంగాణ పదో తరగతి పుస్తకాల పై వివాదం చెలరేగింది. పదవతరగతి సోషల్ టెక్స్ట్ బుక్ కవర్ పేజీపై రాజ్యాంగ పీఠికలో సోషలిస్టు, సెక్యులర్ పదాలను తొలగించిన రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి  తప్పుగా ముద్రించింది. 

ఎస్సీఈఆర్టీ వైఖరిపై ఉపాధ్యాయ సంఘాల నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. భారతదేశం సామ్యవాద, లౌకిక దేశం కాదా.. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఉద్దేశపూర్వకంగా పదాలు తొలగించిందా  అని ప్రశ్నిస్తున్నారు. 
వెంటనే SCERT పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.