డబుల్ బెడ్​రూమ్ వసతులకు196 కోట్లు విడుదల

డబుల్ బెడ్​రూమ్ వసతులకు196 కోట్లు విడుదల

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో సౌలతుల కల్పనకు ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేసింది. మొత్తం రూ.196.46 కోట్లు రిలీజ్ చేస్తూ హౌసింగ్ సెక్రటరీ జ్యోతి బుద్ధ ప్రకాశ్ మంగళవారం జీవో రిలీజ్ చేశారు. ఇండ్ల నిర్మాణం పూర్త యినా.. డ్రింకింగ్ వాటర్, కరెంట్, డ్రైనేజ్ వంటి వసతులు లేకపోవటం తో అవి నిరుపయోగంగా ఉన్నాయి. 

వసతుల కల్పనకు ఫండ్స్ రిలీజ్ చేయాలని గత కొంత కాలంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని అన్ని జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు  కోరతున్నారు. ఈ మేరకు నిధులు విడుదలయ్యాయి. రాష్ర్టంలో వసతులు పూర్తి చేయాల్సిన ఇండ్లు సుమారు 40 వేలు ఉన్నట్లు హౌసింగ్ అధికారులు చెబుతున్నారు.