తెలంగాణలో విస్తృతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ప్రాచీన ఆలయాలు, వారసత్వ ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు ప్రకృతికి సంబంధించిన పర్యాటక గమ్యస్థానాలు తెలంగాణలోని 33 జిల్లాల్లో విస్తరించి ఎంతో ఆకట్టుకుంటున్నాయి. సెప్టెంబర్ 27 ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా తెలంగాణ 33 జిల్లాల్లోని పర్యాటక ప్రదేశాల వివరాలగురించి తెలుసుకుందాం. . .
- హనుమకొండ: ఆలయాలు: భద్రకాళి ఆలయం, పద్మాక్షి ఆలయం, 1000 స్తంభాల గుడి
- వారసత్వ ప్రదేశాలు: 1000 స్తంభాలు, వరంగల్ కోట, వన్యప్రాణుల అభయారణ్యం: వన విజ్ఞాన కేంద్రం, మినీ జూ, ప్రకృతి ఆవిష్కరణలు: మ్యూజికల్ గార్డెన్, రాక్ గార్డెన్, రీజినల్ సైన్స్ సెంటర్, పాకాల్ సరస్సు
- నిర్మల్: ఆలయాలు: బాసర సరస్వతి, కాల్వ నరసింహా స్వామి ఆలయాలు, వారసత్వ ప్రదేశం: నిర్మల్కోట, ప్రకృతి ప్రదేశం: కడెం ప్రాజెక్టు.
- ఆదిలాబాద్: జైనథ్ ఆలయం, ప్రకృతి ఆవిష్కరణ: గాయత్రి, కుంటాల, పొచ్చెర జలపాతాలు
- మంచిర్యాల: వన్యప్రాణి అభయారణ్యాలు: శివరాం వన్యప్రాణి అభయారణ్యం(పెద్దపల్లి జిల్లాలోనూ ఉంది), జన్నారం, కావల్, ప్రాణహిత వన్యప్రాణి అభయారణ్యాలు
- నిజామాబాద్: ఆలయాలు: కంఠేశ్వర్, ఖిల్లా, డిచ్పల్లి రామాలయాలు, సారంగాపూర్ హనుమాన్ మందిరం, వారసత్వ ప్రదేశం: నిజామాబాద్ కోట, ప్రకృతి
- ఆవిష్కరణ: అలీసాగర్ రిజర్వాయర్, మల్లారం అడవి, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, వన్యప్రాణి అభయారణ్యాలు: అలీసాగర్ జింకల పార్క్
- సిద్దిపేట : ఆలయాలు: కోటి లింగేశ్వర స్వామి ఆలయం, మల్లికార్జున స్వామి ఆలయం, విద్యా సరస్వతి క్షేత్రం.
- నల్లగొండ: ఆలయాలు: మహాత్మాగాంధీ ఆలయం(చిట్యాల), వారసత్వ ప్రదేశం: దేవరకొండ కోట, కొలనుపాక జైన ఆలయం, నాగార్జున సాగర్, నందికొండ, రాచకొండ కోట.
- ప్రకృతి ఆవిష్కరణ: నాగార్జున సాగర్.
- యాదాద్రి భువనగరి: ఆలయాలు: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, సురేంద్రపురి– పౌరాణిక థీమ్ పార్కు. వారసత్వ ప్రదేశం: భువనగరి కోట.
- రంగారెడ్డి: పర్యాటక గమ్యస్థానాలు: రామోజీ ఫిల్మ్ సిటీ, హైటెక్ సిటీ, ఉస్మాన్ సాగర్ డ్యాం, మహేశ్వరంలోని మత స్థలాలు, శిల్పారామం థీమ్ విలేజ్, ఓషియన్ పార్క్, షామీర్పేట సరస్సు, అనంతగిరి కొండలు, ఆలయాలు: చిలుకూరి బాలాజీ మందిరం, సంఘీ మందిరం, కీసరగుట్ట, సమతామూర్తి విగ్రహం, వన్యప్రాణుల అభయారణ్యాలు: మహావీర్ వనస్థలి జాతీయపార్క్, మృగనయని జాతీయ పార్కు, చిల్కూరు.
- కరీంనగర్ : ఆలయాలు: నగునూరు ఆలయం, వారసత్వ ప్రదేశం: ఎలగందల కోట, మొలంగూరు కోట, సిల్వర్ ఫిలిగ్రీ, ప్రకృతి ఆవిష్కరణ: దిగువ మానేరు డ్యాం,
- వన్యప్రాణి అభయారణ్యాలు: ఉజ్వల జింకల పార్క్
- పెద్దపల్లి : వారసత్వ ప్రదేశం: రామగిరి ఖిలా(కోర్టు), ధూళికట్ట. వన్యప్రాణి అభయారణ్యం: శివరాం వన్యప్రాణి అభయారణ్యం (మంచిర్యాలలోనూ ఉంది),
- ప్రకృతి ఆవిష్కరణ: సబితం జలపాతం
- జగిత్యాల: ఆలయాలు: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం(ధర్మపురి). వారసత్వ ప్రదేశం: జగిత్యాల కోట
- రాజన్న సిరిసిల్ల: ఆలయాలు: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం
- ఖమ్మం : ఆలయాలు: జమలాపురం ఆలయం, కూసుమంచి శివలింగం(కల్లూరు),
- వారసత్వ ప్రదేశం: నేలకొండపల్లి విగ్రహాలు, ఖమ్మంకోట,
- ప్రకృతి ఆవిష్కరణ: పేరంటాలపల్లి కొండలు, వన్యప్రాణి అభయారణ్యాలు: కిన్నెరసాని వన్యప్రాణి అభయారణ్యం.
- భద్రాద్రికొత్తగూడెం: ఆలయాలు: భద్రాచలం సీతారామ స్వామి వారి ఆలయం, వారసత్వ ప్రదేశం: పర్ణశాల – శ్రీరామశకం
- మహబూబ్‌నగర్: ఆలయాలు: మన్యంకొండ(వెంకటేశ్వర ఆలయం), గంగాపురం, జడ్చర్ల (చెన్నకేశవస్వామి ఆలయం), సీతారామచంద్ర స్వామి ఆలయం, సిరిసనగండ్ల, కురుమూర్తి రాయుడు, కొత్తకోట, వారసత్వ ప్రదేశం: పిల్లలమర్రి, గొప్ప మర్రి చెట్టు,
- ప్రకృతి ఆవిష్కరణ: కోయిల్ సాగర్జోగులాంబ గద్వాల: ఆలయాలు: ఆలంపూర్ జోగులాంబ ఆలయం, వారసత్వ ప్రదేశం: గద్వాల్ కొండ కోట,
- ప్రకృతి ఆవిష్కరణ: ప్రియదర్శిని జూరాల ఆనకట్ట.
- వనపర్తి : ప్రకృతి ఆవిష్కరణ: సరళా సాగర్ ఆనకట్ట
- మెదక్: ఏడుపాయల వనదుర్గాభవాని ఆలయం, మెదక్ చర్చి, అల్లాదుర్గ్, వారసత్వ ప్రదేశం: మెదక్ కోట,
- ప్రకృతి ఆవిష్కరణ: పోచారం రిజర్వాయర్ ఎదితనూర్(నియోలిథిక్ యుగాల నాటి అందమైన గుహల పెయింటింగ్‌లకు పేరు గాంచిన గ్రామం ఎదితనూర్) పోచారం వన్యప్రాణి అభయారణ్యం.
- జయశంకర్ భూపాలపల్లి : ఆలయాలు: కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం, ప్రకృతి ప్రదేశాలు: బొగత జలపాతాలు,
- వన్యప్రాణుల అభయారణ్యం: తాడ్వాయి వన్యప్రాణుల అభయారణ్యం.
- తాడ్వాయి వన్యప్రాణుల అభయారణ్యం: వన్యప్రాణుల ప్రాముఖ్యం దృష్ట్యా ఈ ప్రాంతంలో రాష్ట్ర అటవీశాఖ ప్రత్యేకతను సంతరించుకుంది. రాష్ట్ర అటవీశాఖ ఇక్కడ వనజీవన్ (తాడ్వాయి హట్స్ – కాంప్లెక్స్) అనే అటవీ రిపోర్టును లోతైన రిజర్వు ఫారెస్టు ప్రాంతంలో నిర్మించి అభివృద్ధి చేసింది.
- దామరవాయి: తాడ్వాయి నుంచి 15 కి.మీ.ల దూరంలోని దామరవాయిలో మెగాలలిథిక్ శ్మశాన నిర్మాణాలు ఉన్నాయి. ఈ సమాధులు 10,000 ఏండ్ల క్రితం ఇక్కడ చరిత్ర పూర్వ మానవుని ఉనికికి సాక్ష్యంగా నిలుస్తాయి. ఇవి ప్రత్యేక నిర్మాణాలు మెగాలిథిక్ నిర్మాణపు ఒకే గది – రెండు లేదా అంత కంటే ఎక్కువ నిర్మాణాలతో క్యాప్‌స్టోన్ యుక్తంగా క్షితజ సమాంతరంగా ఉంది.
- మల్లూరు: ఇది ఏటూరు నాగారం నుంచి 5 కి.మీ.ల దూరంలో ఉంది. అడవి గుండా ప్రవహించే నీటి బుగ్గ చింతామణి జలపాతం ఈ ప్రాంతంలో చాలా ముఖ్యమైంది.
- బొగత జలపాతాలు: వాజేడు మండలం చీకుపల్లి గ్రామ సమీపంలో ఉంది. ఈ అందమైన జలపాతం దట్టమైన అడవిలో 30 మీటర్ల పొడవుతో 200 మీటర్ల వరకు ఉంటుంది. దీన్ని స్థానికంగా తెలంగాణ నయాగరా జలపాతం అంటారు.
- ములుగు: ఆలయాలు: రామప్పదేవాలయం, సమక్క సారలమ్మ జాతర, వారసత్వ ప్రదేశాలు: రామప్ప ఆలయం: ఇది శివాలయానికి ప్రసిద్ధి. దీనిని కాకతీయ రాజులు నిర్మించారు. దీనిని 2021లో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. ఇది ములుగు నుంచి 15 కి.మీ.లో ఉండి ప్రపంచ వ్యాప్తంగా వేల మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది.
- లక్నవరం సరస్సు: ఇది ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండలంలో ఉంది. అందమైన పచ్చటి కొండల వలయంతో చుట్టిఉన్న ఒక విశాలమైన సరస్సు. ఇక్కడ పచ్చని ద్వీపాలు, నిర్మలమైన జలాలు, పొడవైన వేలాడే వంతెన ఉంది. 160 మీటర్ల పొడవైన వేలాడే వంతెన ఈ గమ్యస్థానపు ప్రత్యేక ఆకర్షణ.