![తెలంగాణకు 5 అంతర్జాతీయ అవార్డులు](https://static.v6velugu.com/uploads/2023/06/Beautiful-Buildings_kLEcA8GRvx.jpg)
తెలంగాణకు ప్రతిష్టాత్మక అవార్డులు వచ్చాయి. గ్రీన్ యాపిల్ అవార్డుల్లో మొత్తం ఐదు అవార్డులు తెలంగాణకు దక్కాయి. రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన కట్టడాలకు ఈ 5 అంతర్జాతీయ అవార్డులు లభించాయి.
ఈ అవార్డులను లండన్ గ్రీన్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. ఇంటర్నేషనల్ గ్రీన్ ఆపిల్ అవార్డ్స్ ఫర్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ కేటగిరిలో తెలంగాణ కట్టడాలు అవార్డులు దక్కించుకున్నాయి. ఇందులో భాగంగా మొజంజాహి మార్కెట్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, బీఆర్ అంబేద్కర్ తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ బిల్డింగ్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, యాదాద్రి టెంపుల్ వంటి కట్టడాలు చోటు దక్కించుకున్నాయి.
తెలంగాణ కట్టడాలు 5 అవార్డులను గెలుచుకున్నందుకు సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఇండియన్ బిల్డింగ్ నిర్మాణంలో ఇలాంటి అవార్డ్స్ రావడం ఇదే మొదటిసారి అని ఆయన తెలిపారు. జూన్ 16న లండన్ లో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరుగనుంది. తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎస్ అరవింద్ కుమార్ ఈ అవార్డులను అందుకోనున్నారు.
అవార్డులు గెలుచుకున్న కట్టడాలు
1. మొజంజాహి మార్కెట్
2. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి
3. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ బిల్డింగ్
4. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్
5. యాదాద్రి టెంపుల్