
దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,815 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 4,34,69,234కి చేరుకుంది. కరోనాతో పోరాడుతూ మరో 38 మంది ప్రాణాలు కొల్పోయారు. దీనితో మరణాల సంఖ్య 5,25,343కు పెరిగింది. 15,899 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే... 24 గంటల్లో 528 కేసులు రికార్డు అయినట్లు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 485 మంది ఆరోగ్యవంతులయ్యారని.. ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి 7, 96, 365 మంది కోలుకున్నారని పేర్కొంది. గత 24 గంటల్లో కరోనా నుంచి ఎవరూ చనిపోలేదని, మరణాల సంఖ్య 4 వేల 111గా ఉందని తెలిపింది. రికవరీ రేటు 98.85 శాతంగా ఉందని, మొత్తం 24 వేల 968 టెస్టులు నిర్వహించడం జరిగిందని వెల్లడించింది.
ఏ జిల్లాలో ఎన్ని కేసులు : -
ఆదిలాబాద్ 10, భద్రాద్రి కొత్తగూడెం 15, హైదరాబాద్ 327, జగిత్యాల 2, జనగాం 00, జయశంకర్ భూపాలపల్లి 00, జోగులాంబ గద్వాల 00, కామారెడ్డి 01, కరీంనగర్ 12, ఖమ్మం 13, కొమరంభీం ఆసిఫాబాద్ 00, మహబూబ్ నగర్ 03, మహబూబాబాద్ 05, మంచిర్యాల 05, మెదక్ 00, మేడ్చల్ మల్కాజ్ గిరి 39, ములుగు 00, నాగర్ కర్నూలు 02, నల్గొండ 09, నారాయణపేట 05, నిర్మల్ 00, నిజామాబాద్ 02, పెద్దపల్లి 04, రాజన్న సిరిసిల్ల 01, రంగారెడ్డి 52, సంగారెడ్డి 09, సిద్ధిపేట 01, సూర్యాపేట 02, వికారాబాద్ 00, వనపర్తి 01, వరంగల్ రూరల్ 00, హన్మకొండ 05, యాదాద్రి భువనగరి 03. మొత్తం - 528
కోవిడ్ ప్యాండెమిక్ తో ఇప్పుడు అంతా హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటున్నారు. కానీ కోవిడ్ టీకా వచ్చిన తర్వత చాలా మంది సేఫ్టీ ప్రికాషన్స్ ను మర్చిపోతున్నారు. అసలే రెయినీ సీజన్.. అందులోనూ సీజనల్ వ్యాధులు వ్యాప్తి మొదలైంది. ఇలాంటి టైమ్ లో ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తప్పకుండా పాటించాలంటున్నారు డాక్టర్స్.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
— IPRDepartment (@IPRTelangana) July 9, 2022
(Dated.09.07.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/eI6w7hjchl