ఇంటి పర్మిషన్‌కు లంచం.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ రాజ్ ఏఈ

ఇంటి పర్మిషన్‌కు లంచం.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ రాజ్ ఏఈ

వరంగల్: ఇంటి పర్మిషన్ కోసం లంచం తీసుకుంటూ పంచాయతీ రాజ్ ఏఈ ఏసీబీకి చిక్కాడు. వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి నిర్మాణం అనుమతి కోసం మండలానికి చెందిన పీఆర్ ఏఈ రమేష్‌ను కలిశాడు. అందుకు ఏఈ రూ.10 వేలు లంచం డిమాండ్ చేశాడు. చేసేదేమి లేక సదరు బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు సోమవారం(ఫిబ్రవరి 10) హనుమకొండ సుబేదారిలో బాధితుడి నుంచి పది వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.