
నెక్కొండ, వెలుగు: అనారోగ్యంతో తెలంగాణ ఉద్యమ కారిణి చనిపోయిన ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ టౌన్ లో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. మహ్మద్ అమీనాబీ(60) తెలంగాణ మలి దశ ఉద్యమంలో నర్సంపేట నియోజకవర్గంలో మహిళ జేఏసీ తరఫున రైలు రోకో, వంటావార్పు, రిలే నిరాహార దీక్షల్లో చురుకుగా పాల్గొన్నారు. అప్పట్లో ఆమెపై పలు పోలీసుస్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి.
అమీనాబీ, బాబు దంపతులకు కొడుకు మదార్, ఇద్దరు కూతుళ్లు ఉండగా పెండ్లిళ్లు అయ్యాయి. ఆమె భర్త రెండేండ్ల కింద అనారోగ్యంతో చనిపోయాడు. కాగా ఇటీవల ఆమె మనుమడు( మదార్ కొడుకు) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అప్పటి నుంచి అమీనాబీ తీవ్ర మనస్తాపం చెందుతూ అనారోగ్యానికి గురై ఆదివారం చనిపోయారు. ఆమె మృతితో నెక్కొండ టౌన్ లో విషాదం నెలకొంది.