తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి కన్నుమూత

హైదరాబాద్: తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నాయకులు జిట్టా బాలకృష్ణా రెడ్డి(52) మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన హైదరాబాద్‎లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ (సెప్టెంబర్ 6) తుదిశ్వాస విడిచారు. జిట్టా మరణంపై ఆసుపత్రి వర్గాలు మరి కాసేపట్లో అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. జిట్టా మరణ వార్త తెలుసుకుని ఆయన అభిమానులు, తెలంగాణ ఉద్యమకారులు, పలువురు రాజకీయ నాయకులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. భువనగిరి శివారు మగ్గంపల్లి రోడ్డులోని ఆయన ఫామ్ హౌస్లో సాయంత్రం నాలుగు గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.