టీఆర్ఎస్ లో అసంతృప్తి.. టికెట్ కోసం బిల్డింగ్ ఎక్కి నిరసన

వరంగల్ అర్బన్ TRSలో అసంతృప్తులు పెరుగుతున్నారు. 24వ డివిజన్ టికెట్ ను తనకే కేటాయించాలంటూ టీఆర్ఎస్ సీనియర్ నేత శోభారాణి బిల్డింగ్ పైకి ఎక్కి.. పెట్రోల్ బాటిల్ తో నిరసన తెలుపుతున్నారు. తనకు టికెట్ ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నారు శోభారాణి. టీఆర్ఎస్ లో ఉద్యమకారులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు టికెట్ కేటాయించేవరకు బిల్డింగ్ పై నుంచి దిగనన్నారు శోభరాణి. 

ఉద్యమ కాలం నుంచి పార్టీలో పనిచేస్తున్నా గుర్తింపు దక్కటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికార పార్టీ కార్యకర్తలు. నిన్న 9వ డివిజన్ నుంచి టీఆర్ఎస్ టికెట్ రాలేదని మనస్తాపంతో సెల్ టవర్ ఎక్కాడు టీఆర్ఎస్ నాయకుడు దర్శన్ సింగ్. పార్టీకి ఎంత సేవచేసినా.. పట్టించుకోవడం లేదని ఆయన కుటుంబసభ్యులు ఆవేదనగా చెప్పారు.