తెలంగాణ ఉద్యమకారుడు కొమురయ్య ఇక లేరు

తెలంగాణ ఉద్యమకారుడు కొమురయ్య ఇక లేరు.  రుద్రంగి ముద్దుబిడ్డైన వెంగళ కొమురయ్య గౌడ్ గుండెపోటుతో మృతి చెందారు.  రాష్ట్ర ఏర్పాటు కొరకు జరిగిన ఉద్యమంలో ఆయన అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టి.. ఉద్యమానికి ఊపు తెచ్చారు.  ఆయన మరణంతో చందుర్తి, రుద్రంగి మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. 

రాజన్న సిరిసిల్లాకు చెందిన  కొమురయ్య..   టీఆర్ఎస్ పార్టీ అవిర్భావం నుంచి సీఎం కేసీఆర్ తో కలిసి ఉన్నారు.  తొమ్మిదో తరగతి వరకు చదువుకున్న కొమురయ్య.. తెలంగాణ  రాష్ట్ర ఏర్పాటు కోసం తన  ప్రాణ త్యాగానికి సిద్దమై ఉద్యమంలో పాల్గొన్నారు.  కాగా కొమురయ్య  టీఆర్ఎస్ బీసీ సెల్ కార్యదర్శిగా పనిచేశారు.