ఉద్యమకారుల డిమాండ్లు నెరవేర్చాలి .. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ

ఉద్యమకారుల డిమాండ్లు నెరవేర్చాలి .. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ

బషీర్​బాగ్, వెలుగు: తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి అధ్యక్షతన బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు. సెక్రెటరీ జనరల్ ప్రపుల్ రాంరెడ్డి, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. 

ఉద్యమకారులకు సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని యాదగిరి విజ్ఞప్తి చేశారు. మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయాలని కోరారు. తొలి, మలి దశ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన తమను బీఆర్ఎస్​పట్టించుకోలేదని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా అండగా నిలవాలని కోరారు. ప్రధాన కార్యదర్శిలు బత్తుల సోమన్న, డోలక్ యాదగిరి, కోశాధికారి చంద్రన్న ప్రసాద్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాధవిరెడ్డి, అధ్యక్షులు వేముల యాదగిరి, కె.రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.