
పద్మారావునగర్, వెలుగు: ఈ నెల 21న జరిగే తెలంగాణ ఉద్యమకారుల ప్లీనరీ సమావేశానికి ఉద్యమకారులందరూ తరలిరావాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పిలుపునిచ్చింది. ప్లీనరీ నిర్వహణకు సీతాఫల్మండి జీహెచ్ఎంసీ ఫంక్షన్ హాల్ లో భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి హాజరుకావాలని గురువారం ఆహ్వన లేఖను నిర్వాహకులు అందజేశారు. ఈ సందర్భంగా ప్లీనరీ పోస్టర్లను వారు ఆవిష్కరించారు.
తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఇచ్చి హామీ ప్రకారం 250 గజాల ఇంటి స్థలం, రూ.25 వేల పెన్షన్ అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం తప్పనిసరిగా గుర్తిస్తుందన్నారు. కార్యక్రమంలో గుండు దయానంద్, పి సురేందర్ రెడ్డి, చీమ శ్రీనివాస్, ఏ. శివకుమార్ నేత తదితరులు పాల్గొన్నారు.